యాప్నగరం

కేఎల్ రాహుల్.. అతియాల శెట్టిల పెళ్లికి గ్రీన్ ఇచ్చిన సునీల్ శెట్టి.. ఈ కామెంట్‌కు అర్థం అదేనా..?

టీం ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి ప్రేమలో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరి పెళ్లికి అతియా తండ్రి బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి అంగీకరం తెలిపినట్లే అనిపిస్తుంది. అందుకు ఆయన పెట్టిన కామెంటే సాక్ష్యం అంటున్నారు నెటిజన్లు.

Samayam Telugu 19 Apr 2021, 4:58 pm
టీం ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిల మధ్య ప్రేమ వ్యవహారం ఇప్పటిది కాదు. చాలా కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఎన్నో సందర్భంగా వీళ్లు పార్టీలకు, లంచ్‌లకు వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. అయితే ఆరంభంలో ఈ విషయం గురించి ప్రశ్నిస్తే.. కాస్త బుకాయించినా.. ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. సోషల్‌మీడియాలో ఒకరి గురించి మరొకరు పోస్ట్ చేయడం. లేద ఒకరి పోస్ట్‌లకు మరొకరు లవ్ సింబల్స్‌తో కామెంట్ చేయడం వంటివి చేస్తున్నారు.
Samayam Telugu అతియా శెట్టి పోస్ట్ మరియు సునీల్ శెట్టి
Athiya Shetty and Sunil Shetty


అయితే ఇప్పుడు వీరిద్దరి వివాహానికి అతియా తండ్రి సునీల్ శెట్టి ఓకే చెప్పేశాడని టాక్ వినిపిస్తోంది. గతంలో ఎప్పుడు సునీల్ ఈ విషయంపై రియాక్ట్ కాలేదు. కానీ, ఆయన వీరద్దరి ప్రేమను అంగీకరించారని నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఆదివారం కేఎల్ రాహుల్ 29వ పుట్టినరోజు జరిగింది. ఈ వేడుకను అతను అతియాతో కలిసి జరుపుకున్నాడు. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

దీనిపై అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే దీనిపై సునీల్ శెట్టి కూడా కామెంట్ చేశారు. ‘ట్లూరీ’ అని ఆయన కామెంట్ చేశారు. దాంతో పాటు ఆయన ఓ హార్ట్ సింబల్ కూడా పెట్టారు. దీంతో సునీల్ శెట్టి వీరిద్దరి పెళ్లికి అంగీకారం చెప్పినట్లే అని నెటిజన్లు బలంగా భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.