యాప్నగరం

మేల్ ప్రెగ్నెన్సీపై బాలీవుడ్ మూవీ.. హీరో ఎవరంటే

'మేల్ ప్రెగ్నెన్సీ' అంటే మగవారు గర్భం దాల్చడంపై సినిమా వస్తోంది. బాలీవుడ్‌లో ప్రముఖ హీరో ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.

Samayam Telugu 15 Aug 2020, 1:02 pm
సినిమా ఇండ్రస్టీలో రోజురోజుకు ట్రెండ్ మారుతోంది. కొత్త కొత్త కథలు, కాన్సెప్టలతో సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కొత్త కథలతో వస్తున్నారు. సినిమాల విషయంలో కూడా ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికే యాక్షన్ , ఫ్యామిలీ , పీరియాడిక్ , యానిమేషన్ అంటూ అన్ని రకాల సినిమాలు వచ్చాయి . అయితే ఈ మధ్య బోల్డ్ కంటెంట్లకు కూడా ఆదరణ పెరిగింది. అందుకే వీటిపై వెబ్ సిరీస్ కాకుండా సినిమాలు కూడా వస్తున్నాయి. జనం ఆలోచనల్లో వస్తున్న మార్పులతోనే కొంతమంది కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Samayam Telugu మేల్ ప్రెగ్నెన్సీ
male pregnancy


ముఖ్యంగా బాలీవుడ్ జనాలు బోల్డ్ కంటెంట్ ఆదరిస్తారు. ఇటు ఫ్యామిలీ కంటెంట్ ఆదరిస్తారు. అయితే ఇక ఆడవారి ప్రెగ్నెన్సీ గురించి సినిమాలు రూపొందించిన బాలీవుడ్ మేకర్స్ త్వరలో 'మేల్ ప్రెగ్నెన్సీ' అంటే మగవారు గర్భం దాల్చడం పై సినిమా తీయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త దేశమంతా వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో జనాలలో కూడా ఆసక్తి మొదలైంది. ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జీవిత కథను తెరకెక్కించిన షాద్ అలీ ఈ మూవీని తెరకెక్కించనున్నారు.
Read More: మరోసారి తల్లి కాబోతోన్న కరీనా కపూర్
అయితే ఈ సినిమాలో దిల్జీత్‌ సింగ్‌.. నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరగుతున్నాయి. అయితే ఈ కథా నేపథ్యంలో ఇప్పటికే పంజాబీలో ఓ మూవీ రాగా.. ఆ చిత్ర రీమేక్ కాదని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇక ఇందులో యువ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన మిగతా అప్ డేట్స్ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.