యాప్నగరం

ఆ ముద్దు సీన్‌లో నటించేందుకు రెండు రోజుల ట్రైనింగ్!

మలంగ్‌ సినిమాలో అండర్‌ వాటర్‌లో ఓ కిస్‌ సీన్‌ ఉంది. దాదాపు నిమిషం నిడివి ఉండే ఈ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు.

Samayam Telugu 5 Jan 2020, 6:45 pm
ఆదిత్య రాయ్‌ కపూర్‌, దిశా పటాని, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ మలంగ్‌. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. సినిమాలోని నటీనటులను పాత్రలను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా హీరో హీరోయిన్‌లకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్‌ హాట్ టాపిక్‌గా మారింది.
Samayam Telugu Malang
దిశ పటాని - ఆదిత్య రాయ్‌ కపూర్‌


ఆదిత్య రాయ్‌ కపూర్‌ భూజాల మీద కూర్చున్న దిశ అతడి లిప్‌ లాక్‌ చేస్తున్నట్టుగా ఉన్న స్టిల్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టిల్‌ రిలీజ్‌ అయిన తరువాత సినిమా మీద ఆసక్తి పెరిగింది. పోస్టర్‌లోనే ఇంత ఘాటు రొమాన్స్‌ ఉంటే సినిమాలో ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో అన్న టాక్‌ వినిపిస్తోంది. తాజాగా అలాంటి వార్తే ఒకటి బాలీవుడ్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: ఆ సినిమా ఆగిపోయింది.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

పోస్టర్‌లో రిలీజ్‌ చేసిన సీనే కాకుండా సినిమాలో మరికొన్ని ముద్దు సన్నివేశాలు కూడా ఉన్నాయట. వాటిలో ఓ కిస్‌ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లకు రెండు రోజుల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఇచ్చారు. ఈ సినిమాలో అండర్‌ వాటర్‌లో ఓ కిస్‌ సీన్‌ ఉంది. దాదాపు నిమిషం నిడివి ఉండే ఈ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు.

See Photo Story: బాలీవుడ్ భామ షామా.. హాట్ ఫొటోలు దేఖో మామా!

అంతసేపు అండర్‌ వాటర్‌లో నటించేందుకు వారి లంగ్‌ కెపాసిటీని పెంచేందుకు ఈ ట్రైనింగ్ తీసుకున్నారు. సింగిల్‌ షాట్‌లోనే ఈ ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించారట చిత్రయూనిట్. మోహిత్‌ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram Training for something special #malang🌸 A post shared by disha patani (paatni) (@dishapatani) on May 5, 2019 at 3:27am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.