యాప్నగరం

థాంక్యూ సుశీ... సుశాంత్ ఆత్మహత్యపై ఏక్తా కపూర్ పోస్టు

సుశాంత్ ఆత్మహత్యపై ఎట్టకేలకు ఏక్తా కపూర్ స్పందించారు. అతనికి మొదట అవకాశం ఇచ్చింది తానే అన్నారు. తనపై పెట్టిన కేసుపై కూడా ఏక్తా స్పందించారు.

Samayam Telugu 18 Jun 2020, 11:39 am
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌ ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలించింది. సినీ పరిశ్రమలో బంధు ప్రీతికి సుశాంత్ బలయ్యాడంటూ ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో బాలీవుడ్‌లో పలువురు ప్రముఖులపై నెటిజన్లు మండిపడుతున్నారు. బంధుప్రీతి వలననే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కంగనా రనౌత్, ప్రకాశ్‌రాజ్, అభినవ్ కశ్యప్ వంటి ప్రముఖులు బాహాటంగా చెప్పడంతో ఈ వివాదం మరింత హీటెక్కింది. బాయ్ కట్ బాలీవుడ్ అంటూ కూడా ఓ ట్రెండ్ సెట్ చేశారు. సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్, ఏక్తాకపూర్‌లపై విమర్శలు దుమారం రేగుతోంది. ఇదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణపలపై స్పందించారు ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్.
Samayam Telugu సుశాంత్, ఏక్తా కపూర్

Read More: అందుకే అక్కడ నటించలేదు... బాలీవుడ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సుశాంత్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే. పవిత్ర రిష్తా టీవీ సీరియల్‌లో సుశాంత్‌కి లీడ్ రోల్ ఇచ్చేందుకు ఛానెల్ వారు ఒప్పుకోకపోయిన కూడా వారిని ఒప్పించి ప్రధాన పాత్ర ఇప్పించాను అని ఏక్తా కొన్ని రోజుల కిందట పేర్కొంది. నటుడిగా అవకాశమిచ్చిన తనపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం సుశాంత్ ఫ్యామిలీ దుఃఖంలో ఉన్నారు. వారిని ప్రశాంతంగా ఉండనివ్వండి అని ఏక్తా పేర్కొంది. అయితే తాజాగా సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది.. సుశాంత్ ఆత్మహత్యకి కారణం బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్‌, సంజయ్ లీలా భన్సాలీ సహా 8 మంది అని బిహార్ ముజఫర్ కోర్టులో కేసు నమోదు చేశారు.
View this post on Instagram Thanku for the case for not casting sushi....when Actually I LAUNCHED HIM. I’m beyond upset at how convoluted theories can b! Pls@let family n frns mourn in peace! Truth shall@prevail. CANNOT BELIEVE THIS!!!!! credit: @jagranenglishnews... A police case has been filed against eight people including Bollywood directors @karanjohar, Sanjay Leela Bhansali and @ektarkapoor along with actor @beingsalmankhan in connection with the death of actor Sushant Singh Rajput, news agency ANI reported on Wednesday . "In the complaint, I have alleged that Sushant Singh Rajput was removed from around seven films and some of his films were not released. Such a situation was created which forced him to take the extreme step," Advocate Sudhir Kumar Ojha was quoted as saying . . . #sushantsinghrajput #sushantsinghrajputdeath #sushantsinghrajpurrip #jagranenglish #instawithjagranenglish #ripsushantsinghrajputsir💔🙏 #ripsushant #ripsushantsinghrajput🙏 #ripsushantsinghrajput💔 #ripsushantsinghrajput🙏🙏 #ripsushantsinghrajput #sushantnomore #salmankhan #salmankhanfans #salmankhanswag #salmankhanmerijaan #salmankhanfilms #salman #salmankhanfanclub #salmankhanfc #karanjohar #karanjoharfilm #karanjoharupdates #karanjoharfan A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jun 17, 2020 at 1:26am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.