యాప్నగరం

కళ్ళు చెదిరేలా కత్రినా కైఫ్ వెడ్డింగ్ రింగ్.. ఆ ఉంగరం ధర ఎంతో తెలుసా..?

లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సెలబ్రిటీ జోడీ కావడంతో పెళ్ళికి ధరించే ఆభరణాలు చాలా రిచ్‌గా ఉండేలా చూసుకున్నారు. తాజాగా కత్రినా వెడ్డింగ్ రింగ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.

Samayam Telugu 15 Dec 2021, 3:35 pm
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వార హోటల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు సహా వారి వారి సన్నిహితులు, సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. సెలబ్రిటీ జోడీ కావడంతో పెళ్ళికి ధరించే ఆభరణాలు చాలా రిచ్‌గా ఉండేలా చూసుకున్నారు. ముఖ్యంగా కత్రినా కైఫ్ ధరించిన రింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Samayam Telugu కళ్ళు చెదిరేలా కత్రినా కైఫ్ వెడ్డింగ్ రింగ్
Katrina Kaif Wedding


ఈ నిశ్చితార్తపు ఉంగరంలో నీలమణితో చేసిన డైమండ్ అమర్చబడి ఉంది. చూడటానికి ఎంతో అందంగా, కాస్ట్లీగా కనిపిస్తోంది. అయితే ఈ ఉంగరం ఖరీదు విషయమై ఆసక్తికర వివరాలు బయటకొచ్చాయి. దీని ఖరీదు దాదాపు 7,40,000 అని తెలుస్తోంది. అచ్చం ఇలాంటి ఉంగరాన్ని గతంలో బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా, ప్రిన్స్ చార్లెస్తో నిశ్చితార్థం సమయంలో ధరించడం విశేషం. దీంతో పాటు ఈ వేడుకలో కత్రినా కాస్ట్యూమ్స్ అన్నీ కూడా హైలైట్ అయ్యాయి. ఆమె సబ్యసాచి అనే డిజైనర్ డిజైన్ చేసిన ఖరీదైన లెహంగా ధరించింది.
ఛ.. పరువు పోయింది! సమంత ఇష్యూపై మాధవీలత షాకింగ్ రియాక్షన్.. ఆ మాటతో సంచలనం
పెళ్లికి వచ్చే అతిథులు కెమెరాలు, ఫోన్లు తీసుకురావద్దని ముందే రిక్వెస్ట్ చేశారట కత్రినా దంపతులు. పెళ్లి వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి. పెళ్లి మండపంలో ఫోన్ వాడకండి అని అభ్యర్థించారట. అందుకే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ పెద్దగా బయటకు రాలేదు. అయితే పెళ్లి తర్వాత తన భర్త విక్కీతో దిగిన కొన్ని ఫొటో షూట్స్ కత్రినా షేర్ చేస్తుండటంతో ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి జోడీ చూడముచ్చటగా ఉందంటూ వాళ్లకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.