యాప్నగరం

‘ఆ సినీ రచయిత మమ్మల్ని రేప్ చేశాడు’

మరో షాకింగ్ మీటూ సంఘటన ఒకటి బయటికి వచ్చింది. కోల్‌కత్తాకు చెందిన ప్రముఖ సినీ రచయిత సుదీప్తో చటర్జీ తన వద్ద ట్రైనింగ్‌కు వచ్చే ముగ్గురు అమ్మాయిలను రేప్ చేశాడట.

Samayam Telugu 17 Oct 2019, 5:34 pm
క్యాస్టింగ్ కౌచ్, మీటూ సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా జరుగుతున్నాయని మరోసారి రుజువైంది. కోల్‌కత్తాకు చెందిన సుదీప్తో చటర్జీ అనే ప్రముఖ సినీ రచయిత తన వద్ద ట్రైనింగ్‌కు వస్తున్న ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారం చేశాడట. ఈ విషయాన్ని ముగ్గురూ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. సుదీప్తో వద్ద శిక్షణ తీసుకుంటున్న ఓ బాధితురాలు అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
Samayam Telugu sudipto chatterji
సుదీప్తో చటర్జీ


READ ALSO: చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్నా : హీరోయిన్‌ రాధికా ఆప్టే

‘సుదీప్తో నాకు ఫోన్ చేసి నటించాలంటే ఎలా శ్వాస తీసుకోవాలో నేర్పిస్తానని తన ఇంటికి రమ్మన్నాడు. నేను వెళ్లాను. నాకు ఎక్సర్‌సైజెస్ నేర్పిస్తానని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడు. పైగా అతను టచ్ చేస్తున్నప్పుడు నేను డైలాగులు చెప్తూ ఉండాలని అన్నాడు. ఆ సమయంలో నేను శవంలా అయిపోయాను. ఏడుపు దిగమింగుకున్నాను. ఆ తర్వాత ఈ బాధ నుంచి తేరుకుని నా విషయాన్ని బయటపెట్టాలనుకున్నాను. ఆ తర్వాత అతను నా విషయంలో చేసింది చాలా తప్పు అని చెప్తూ అతనికి వాట్సాప్ మెసేజ్ చేశాను. ఆ మెసేజ్ చూసి నన్ను బ్లాక్ చేశాడు. నా పట్ల జరిగేదంతా అతని భార్యకు కూడా తెలుసు. కానీ ఇవన్నీ బయటికి వస్తే పరువు పోతుందని నా నోరు మూయించింది. ఆ తర్వాత నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేనొక్కదాన్నే కాదు నాతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారు. నేను ఈ విషయాలన్నీ బయటపెడితే మిగతా బాధితులు కూడా ధైర్యంగా తమ అనుభవాలను బయటపెడతారని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

READ ALSO: నటి సూసైడ్ కేసులో నిందితుడు, కొత్త సినిమాతో వచ్చాడు

ఆమె అనుకున్నట్లుగానే సుదీప్తో వల్ల లైంగిక వేధింపులకు గురైన మరో ఇద్దరు యువతులు తమ అనుభవాలను బయటపెట్టారు. సుదీప్తో తమపై అత్యాచారం చేశాడని తెలిపారు. 20 ఏళ్ల వయసులో థియేటర్‌లో నాటకాల్లో నటించాలనుకున్నానని, ఇందుకోసం సుదీప్తో వద్ద శిక్షణ తీసుకోవాలనుకున్నానని తెలిపారు. మూడో బాధితురాలు కూడా సుదీప్తో వల్ల తాను రెండేళ్లు నరకం అనుభవించానని తెలిపారు. తనకంటే ముందు ఇద్దరు బాధితులు ఈ విషయాలు బయటపెట్టడంతో తనకూ కాస్త ధైర్యం వచ్చిందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.