యాప్నగరం

అర్జున్ కపూర్ గర్ల్‌ఫ్రెండ్ మలైకాకు కరోనా పాజిటివ్

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ప్రేయసి మలైకా అరోరాకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ముందు అర్జున్ కపూర్‌కు కరోనా సోకినట్టు తేలిన విషయం తెలిసిందే.

Samayam Telugu 7 Sep 2020, 10:52 am
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సినిమా సెలబ్రిటీల్లోనూ కొవిడ్-19 పాజిటివ్ కేసులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు అర్జున్ కపూర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, ఆయన ప్రేయసి మలైకా అరోరాకు కూడా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మలైకా అరోరా చెల్లెలు అమృత అరోరా టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.
Samayam Telugu అర్జున్ కపూర్, మలైకా అరోరా
Arjun Kapoor, Malaik Arora


అంతకు ముందు అర్జున్ కపూర్ తన ఆరోగ్యానికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘నాకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం మీ అందరికీ చెప్పడం నా బాధ్యత. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నేను బాగానే ఉన్నాను. డాక్టర్లు, అధికారుల సూచన మేరకు నేను నా ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. హోం క్వాంటైన్‌లోనే ఉంటాను. మీ ప్రోత్సాహానికి ముందుగానే కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో నా ఆరోగ్యం గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. గతంలో ఎప్పుడూ చూడని కఠిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మానవాళి ఈ వైరస్‌ను అధిగమిస్తుందని నాకు నమ్మకం ఉంది. ప్రేమతో, మీ అర్జున్’’ అని అర్జున్ కపూర్ పేర్కొన్నారు.
View this post on Instagram 🙏🏽 A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Sep 6, 2020 at 1:33am PDT
ఇదిలా ఉంటే, అర్జున్ కపూర్ - మలైకా అరోరా తమ ప్రేమ విషయాన్ని కిందటేడాది అధికారికంగా ప్రకటించారు. నిజానికి మలైకా అరోరాకు గతంలో పెళ్లయింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ ఉన్నాడు. అర్బాజ్ ఖాన్ నుంచి 2017లో మలైకా విడిపోయారు. అయితే, అర్బాజ్ ఖాన్ నుంచి విడిపోవడానికి ముందే అర్జున్ కపూర్‌తో మలైకా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు వదంతులు ఉన్నాయి.

మరోవైపు అర్జున్ కపూర్ కూడా గతంలో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆమె నుంచి విడిపోయిన తరవాతే సల్మాన్ ఖాన్ మరదలితో అర్జున్ కపూర్ కథ నడిపినట్టు ప్రచారంలో ఉంది. కాగా, అర్జున్ కపూర్ - మలైకా అరోరా మధ్య సుమారు 18 సంవత్సరాల వయసు తేడా ఉంది.
View this post on Instagram @manishmalhotraworld × @renuoberoiluxuryjewellery × @manekaharisinghani × @divyachablani15 × @flavienheldt × @hardikphoto × @retoucher_k.tur @sonytvofficial #indiasbestdancer A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Aug 16, 2020 at 10:02pm PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.