యాప్నగరం

Manoj Bajpayee: ఫ్యామిలీ మ్యాన్ నటుడి తల్లి కన్నుమూత..

ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee ) తల్లి కన్నుమూశారు. ఏడాది కిందటే ఆయన తండ్రి మరణించగా.. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి గీతాదేవి(Geeta Devi) ఈరోజే చనిపోయారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను ఇరవై రోజుల కిందట ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Authored bySanthosh Damera | Samayam Telugu 8 Dec 2022, 3:18 pm

ప్రధానాంశాలు:

  • మనోజ్ బాజ్‌పాయ్ తల్లి గీతాదేవి కన్నుమూత
  • ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఏడాది కిందటే చనిపోయిన తండ్రి ఆర్కే బాజ్‌పాయ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Manoj Bajpayee, Geeta Devi
మనోజ్ బాజ్‌పాయ్
రాంగోపాల్ వర్మ్ దర్శకత్వంలో వచ్చిన ‘సత్య’ మూవీతో నటుడిగా స్థిరపడ్డ మనోజ్ బాజ్‌పాయ్ తల్లి గీతాదేవి(80) గురువారం ఉదయం
8.30 గంటలకు మరణించారు. ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా తల్లి మరణ వార్తను మనోజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 20 రోజుల క్రితమే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం చనిపోయినట్లు వెల్లడించారు.
గీతాదేవికి మనోజ్‌తో పాటు మరో ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక ఆయన తండ్రి ఆర్కే బాజ్‌పాయ్ గతేడాది అక్టోబర్‌లో మరణించారు. తండ్రి ఆర్కే కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోనే 83 ఏళ్ల వయసులో మరణించారు. ఆ సమయంలో మనోజ్ కేరళలో ఒక సినిమా షూటింగ్‌లో ఉండగా.. మరణ వార్త తెలిసిన వెంటనే అంత్యక్రియల కోసం ఢిల్లీకి వెళ్లారు.

ఇదిలా ఉంటే.. బుధవారమే మనోజ్ బాజ్‌పాయ్ తన అప్‌కమింగ్ ఫిల్మ్, కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కనున్న ‘బండా’ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ నుంచి తన ఫస్ట్‌లుక్‌ కూడా ఆవిష్కరించారు. గతంలో ఆస్పిరెంట్స్, సాస్ బహు ఆచార్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి వెబ్ షోస్‌లో పనిచేసిన అపూర్వ్ సింగ్ కర్కి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాను కమలేష్ భానుషాలి, ఆసిఫ్ షేక్ & విశాల్ గుర్నానీ నిర్మిస్తున్నారు.

మనోజ్ ఇటీవలే 1998లో తాను నటించిన ‘సత్య’ చిత్రంలోని పాపులర్ సాంగ్ ‘సప్నే మే మిల్తీ హై’ రీమిక్స్‌లో కనిపించాడు. లిజో జార్జ్, డీజే చేతాస్ చేసిన ఈ రీమిక్స్‌లో మనోజ్ ధ్వని భానుషాలి, అభిమన్యు దాసానితో కలిసి స్టెప్పులేశాడు. ఇక బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రాజ్ డీకే తెరకెక్కించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ రెండు భాగాల ద్వారా మనోజ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు.

ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘సత్య’ మనోజ్‌కు చాలా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అనేక బాలీవుడ్‌ చిత్రాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసిన మనోజ్.. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్‌లో ఒకరిగా చోటు సంపాదించాడు. ఇక తెలుగులోనూ సుమంత్ హీరోగా ఆర్జీవీ రూపొందించిన ‘ప్రేమ కథ’ చిత్రంలో విలన్‌గా నటించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరణ్ తెరకెక్కించిన ‘హ్యాపీ’ చిత్రంలోనూ కామెడీ టచ్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో మెప్పించాడు.

రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.