యాప్నగరం

రేప్‌లు జరగడానికి మనమే కారణమట: పాక్ పీఎం

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారతీయ చిత్రపరిశ్రమపై నోరుపారేసుకున్నారు. వారి దేశంలో అత్యచారాలు జరగడానికి కారణం మనమేనని అంటున్నారు.

Samayam Telugu 23 Jan 2020, 11:23 am
పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నుంచి భారతీయులపై నోరుపారేసుకుంటూనే ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. తాజాగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలపై లేనిపోని ఆరోపణలు చేశారు. పాకిస్థాన్‌లో అత్యాచారాలు జరగడానికి, అక్కడి ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిస అవడానికి కారణం బాలీవుడ్, హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలేనట.
Samayam Telugu imran khan
ఇమ్రాన్ ఖాన్


‘‘మన దేశంలో మొబైల్ ఫోన్లు ఓ ఛాలెంజ్‌గా మారిపోయాయి. ఫోన్లు విరివిగా లభ్యం అవుతుండడంతో పిల్లలకు కావాల్సినంత కంటెంట్ దొరకుతోంది. ఆ ఫోన్ల వల్లే పిల్లలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పాఠశాలల్లో మాదక ద్రవ్యాలకు అలవాటుపడుతున్నారు. నాకు ఈ విషయం గురించి మొదట్లో ఏమీ తెలీలేదు కానీ ప్రధానిని అయ్యాక అసలు సమస్య అర్థమైంది. పాకిస్థాన్‌లో సెక్స్ క్రైం కూడా పెరిగిపోతోంది. ఇది చాలా బాధాకరం. ఇక్కడ మనం మరో విషయం గురించి కూడా చర్చించుకోవాలి. మనకు ఫోన్లలో లభ్యమయ్యే కంటెంట్ హాలీవుడ్, బాలీవుడ్ నుంచే వస్తోంది. మానవాళికి ఎంతో ప్రమాదకరమైన వెస్ట్రన్ కల్చర్‌కు మనం ఎక్కువగా అలవాటు పడిపోతున్నాం. బాలీవుడ్, హాలీవుడ్ వల్లే కాపురాలు కూలిపోతున్నాయి’ అన్నారు.

READ ALSO: అపరిచితులకు రోడ్డుపై హగ్గులు.. నటి మ్యాడ్‌నెస్

ఇమ్రాన్ అర్థంపర్థంలేని వ్యాఖ్యలపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయన మాట్లాడింది ఆయనకైనా అర్థం అయిందా అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ సినిమాల వల్ల పాకిస్థాన్ చెడిపోతున్నప్పుడు ఇక్కడి సినిమాలను ఎందుకు చూడాలని అంటున్నారు. బాలీవుడ్‌ సినిమాల కంటే పాక్ చిత్ర పరిశ్రమలో తెరకెక్కే సినిమాల్లోనే బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

READ ALSO: రోజా గారు హీరో.. బాలయ్య ఆమెకు దిష్టిబొమ్మ: వర్మ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.