యాప్నగరం

షర్ట్ విప్పి రొమ్ములు చూపించమన్నాడు: స్టార్ నటి

అమెరికన్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ తనకు ఎదురైన షాకింగ్ ఘటన గురించి వివరించారు. ఓ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వెల్లడించారు.

Samayam Telugu 22 Nov 2019, 10:31 am
ప్రముఖ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్‌ కూడా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నారట. ఓ దర్శకుడు తనతో ప్రవర్తించిన తీరును వివరిస్తూ అందరినీ షాక్‌కు గురిచేశారు. ఇటీవల హాలీవుడ్ నటులు స్కార్లెట్ జొహాన్సన్, రెనీ జెల్‌వెగర్, లుపీటా న్యోంగ్, లౌరా డెర్న్‌లతో కలిసి ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన షాకింగ్ సంఘటన గురించి బయటపెట్టారు.
Samayam Telugu jennifer lopez
జెన్నిఫర్ లోపేజ్


READ ALSO: మేడమ్... ఆ కామాంధుడిని ఏమీ చేయలేరా: సింగర్

‘ఓ డైరెక్టర్ నన్ను షర్ట్ విప్పమన్నాడు. నా వక్షోజాలు చూస్తానన్నాడు. అదేంటి ఇదేం సినిమా సెట్ కాదు కదా అనుకున్నాను. కుదరదు అని చెప్పేశాను. నాకు నేనే సపోర్ట్‌గా నిలిచాను. కానీ కాస్త భయం కూడా వేసింది. నాతో పాటు ఆ రూంలో కాస్ట్యూమ్ డిజైనర్‌ కూడా ఉంది. ఆ డైరెక్టర్‌ నాతో అసహ్యంగా ఏం మాట్లాడాడో అవన్నీ వింటూనే ఉంది. కావాలంటే సెట్‌లో నా వక్షోజాలు చూపిస్తాను కానీ ఇలాంటి ప్రదేశాల్లో కాదని చెప్పాను. ఎందుకంటే ఆ సమయంలో నేను నగ్న సన్నివేశాల్లో నటించాల్సి ఉంది’

READ ALSO: ‘దెయ్యం’ సింగర్ గుర్తుందా? ఆమెను అలా మార్చింది వీళ్లే

‘దాంతో నా రొమ్ములు చూస్తానని అన్నాడు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ నాకు సారీ కూడా చెప్పాడు. ఆ సమయంలో అతను అడిగాడు కదా అని నా షర్ట్ విప్పి చూపించి ఉంటే.. వారు ఏమైనా చేయగలరన్న దీమ వారిలో ఎక్కువైపోతుంది. కానీ నేను ధైర్యం చేసి నో చెప్పాను కాబట్టి అతను వెనక్కి తగ్గి నాకు సారీ చెప్పాడు. ఎప్పుడైతే గదిలో నుంచి ఆ డైరెక్టర్ బయటికి వెళ్లిపోయాడో అక్కడే ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ నా వద్దకు వచ్చి సారీ అలా జరిగి ఉండాల్సింది కాదు అంది’ అని తెలిపారు జెన్నిఫర్ లోపేజ్.

READ ALSO: హీరోగారూ అది ఎంత పెద్ద బూతు మాటో తెలుసా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.