యాప్నగరం

Parineeti Chopra: ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాతో ప‌రిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్ .. ఫొటోస్ వైరల్

Raghav Chadha - Parineeti Chopra Engagement: ఆప్ పార్టీ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా, బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రా నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఎంగేజ్‌మెంట్ రింగ్ ఉన్న ఫొటోను షేర్ చేసింది ప‌రిణీతి..

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 13 May 2023, 10:32 pm
Raghav Chadha - Parineeti Chopra Engagement: బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా నిశ్చితార్థ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. శ‌నివారం న్యూఢిల్లీలో జ‌రిగిన ఈ ఫంక్ష‌న్‌కి ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. చాలా రోజులుగా వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని, ఎంగేజ్‌మెంట్ చేసుకుంటార‌ని, ఫ‌లానా నెల‌లో పెళ్లి చేసుకుంటారంటూ నెట్టింట వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ అటు రాఘ‌వ్ చ‌ద్దా, ఇటు ప‌రిణీతి చోప్రా ఎక్క‌డా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. శ‌నివారం ఎంగేజ్‌మెంట్ అంతా పూర్త‌యిన త‌ర్వాత రాఘ‌వ్ చ‌ద్దాతో క‌లిసి ఉన్న ఫొటోను ప‌రిణీతి చోప్రా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఫోటోతో పాటు ‘నేను ప్రార్థించింతా.. అవునని చెప్పాను’ అంటూ క్యాప్షన్‌ను కూడా ఆమె యాడ్ చేసింది. అభిమానులు, సెల‌బ్రిటీలు రాఘ‌వ్‌, ప‌రిణీతి చోప్రాల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. మీడియాను ఈవెంట్‌కి అనుమ‌తించ‌లేదు.
Samayam Telugu Parineeti Chopra engagement
Parineeti Chopra engagement, పరిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్


చాలా రోజులుగా వారిద్ద‌రూ రిలేష‌న్‌లో ఉఉన్న‌ప్ప‌టికీ మార్చిలోనే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇద్ద‌రూ క‌లిసి ఓ హోటల్‌కు డిన్న‌ర్ డేట్‌కు వ‌చ్చిన‌ప్పుడు అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. విష‌యం తెలిసిన కొన్ని గంట‌ల్లోనే న్యూస్ తెగ వైర‌ల్ అయ్యింది. అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌నే న్యూస్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. అక్టోబ‌ర్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కూడా అంటున్నాయి సినీ స‌ర్కిల్స్‌.

లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎకాన‌మిక్స్‌లో రాఘ‌వ్ చ‌ద్దా, ప‌రిణీతి చోప్రా క‌లిసి చ‌దువుకున్నారు. కామ‌న్ స్నేహితుల ద్వారా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం మ‌రింత పెరిగింద‌ని, అది కాస్త ప్రేమ‌గా మారిందని, త్వ‌ర‌లోనే వారిద్ద‌రూ క‌ల‌సి ఓ ఇంటి వారు కాబోతున్నారు.
View this post on Instagram A post shared by @parineetichopra

Mouni Roy: ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అది కూడా చూపించేయండి.. మౌనీ రాయ్ బికినీపై ట్రోలింగ్‌
Vimanam: ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’... సముద్ర ఖని మరో ఎమోషనల్ రోల్
Sunisith: శాక్రిఫైజింగ్ స్టార్‌ సునిశిత్‌ని చిత‌క బాదిన రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌..వీడియో వైరల్.. ఉపాసన గురించి..

Balagam Venu: ‘బలగం’ డైరెక్టర్‌కి గోల్డెన్ ఛాన్స్‌.. స్టార్ హీరోతో రెండో సినిమా!

Read Latest Tollywood Updates and Telugu News
రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.