యాప్నగరం

ముందు ఆరోగ్యం.. తరువాతే వినోదం.. లాక్‌డౌన్‌‌పై సంజయ్ దత్ రియాక్షన్

కరోనా కట్టడిలో భాగంగా మూడోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోడీ. ఈ విషయమై స్పందించిన హీరో సంజయ్ దత్ ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు.

Samayam Telugu 4 May 2020, 11:20 am
దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుండటం కారణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. కరోనా కట్టడికి సామాజిక దూరం పాటించడం ఒక్కటే సరైన మార్గం అని భావిస్తున్న కేంద్రం లాక్‌డౌన్ విషయమై పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటూ అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే మూడో విడతగా మే 17 వరకు షరతులతో కూడిన లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.
Samayam Telugu లాక్_డౌన్_పై సంజయ్ దత్ రియాక్షన్
Sanjay Dutt


దీంతో దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మొదలుకొని సినిమా షూటింగ్స్ వరకు అన్నీ నిలిచి పోయాయి. తాజాగా ఈ విషయమై స్పందించిన సంజయ్ దత్.. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు. క‌రోనా వైర‌స్ నివారణలో భాగంగా విధించిన ఈ లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలపై ఎఫెక్ట్ పడిన మాట వాస్తవమే అయినప్పటికీ, ప్రజల భ‌ద్ర‌త‌, ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం లాక్‌డౌన్ అమలు చేయ‌డం సబబే అని సంజయ్ దత్ అన్నారు.

ముందు ప్రేక్ష‌కుల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌ ముఖ్యమని, ఆ తరువాతే వినోదం అని సంజయ్ తెలిపారు. పెద్ద ప్రాజెక్టులు తిరిగి సెట్స్ మీదకు రావాలంటే కొంత‌స‌మ‌యం పట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ విపత్కర ప‌రిస్థితుల్లో వీలైనంత ఎక్కువ‌మందికి సాయం చేయాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నామని, న‌ర్గీస్ ఫౌండేష‌న్ ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నామని చెప్పారు. అందరం ఒక‌రికి ఒక‌రుగా మెలుగుతూ కరోనా కష్టాల నుంచి గట్టెక్కాలని సంజయ్ దత్ తెలిపారు.

Also Read: బాయ్ ఫ్రెండ్‌తో టాప్ లెస్ కిస్.. నిస్సిగ్గుగా షేర్ చేసిన స్టార్ హీరో కూతురు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.