యాప్నగరం

సీఎం కొడుక్కి బెస్ట్ ఫ్రెండనా.. కరణ్ జోహార్‌కు పోలీసులు సమన్లు ఇవ్వకపోవడంపై కంగనా ఫైర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరవాత బాలీవుడ్‌లో నెపోటిజంపై గొంతెత్తిన కంగనా రనౌత్.. అప్పటి నుంచి దీనిపై ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబై పోలీసులపై ఆమె విరుచుకుపడ్డారు.

Samayam Telugu 26 Jul 2020, 9:20 pm
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ మేనేజర్‌కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేసినట్టు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. రేపు మొదట మహేష్ భట్‌ను, ఆ తరవాత కరణ్ జోహార్ మేనేజర్‌ను ప్రశ్నించనున్నట్టు అనిల్ వెల్లడించారు. అయితే, ఈ సమన్లపై నటి కంగనా రనౌత్ తన టీమ్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. ముంబై పోలీసులపై విమర్శలు గుప్పించారు.
Samayam Telugu కంగనా రనౌత్
Kangana Ranaut


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని హత్యగా అభివర్ణించిన కంగనా రనౌత్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేకు ప్రాణ స్నేహితుడు కావడం వల్ల కరణ్ జోహార్‌కు సమన్లు జారీ చేయలేదని.. ఆయన మేనేజర్‌కు సమన్లు ఇచ్చారని కంగన ఆరోపించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మర్డర్ ఇన్వెస్టిగేషన్‌‌ను ముంబై పోలీసులు హాస్యాస్పదం చేయడం మానాలని హితవు పలికారు.

Also Read: నువ్వు నా హ్యాపీ ప్లేస్ చే.. కాబోయే భర్తపై ప్రేమను చాటుకున్న నిహారిక

పోలీసులు నెపోటిజంను సపోర్ట్ చేయడం సిగ్గుచేటని కంగనా టీమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆఖరికి సమన్లు జారీ చేయడంలోనూ ముంబై పోలీసులు నిర్లక్ష్యంగా సిగ్గులేని నెపోటిజంను ప్రదర్శించడమేంటి? కంగానాకే సమన్లు ఇచ్చారు.. ఆమె మేనేజర్‌కు కాదు. కానీ, ముఖ్యమంత్రి కొడుక్కి బెస్ట్ ఫ్రెండ్ మేనేజర్‌‌ని విచారణకు పిలిచారు, ఎందుకని?’’ అని తన టీమ్ ట్విట్టర్ ఖాతా ద్వారా కంగనా ప్రశ్నించారు.

కంగనా రనౌత్

గత కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖులకు వ్యతిరేకంగా కంగన పలు ఆరోపణలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రతిభను తొక్కేశారని, ఆయన్ని పక్కా ప్రణాళిక ప్రకారం బహిష్కరించారని, దీని వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కంగన ఆరోపించారు. ఈ మధ్య ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ఆమె పలు రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికీ సోషల్ మీడియాలో వార్ నడుస్తూనే ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.