యాప్నగరం

టీవీ నటుడు అక్షత్ ఉత్కర్ష్ ఆత్మహత్య.. పేరెంట్స్ సంచలన ఆరోపణలు

ముంబయిలో టీవీ నటుడు అక్షత్ ఉత్కర్ష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఫ్లాట్‌లోనే విగతజీవిగా ఉన్న అతడిని స్నేహితురాలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

Samayam Telugu 29 Sep 2020, 7:16 pm
బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై ఓ వైపు వివాదం కొనసాగుతుండగానే ముంబయిలో మరో నటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పలు హిందీ సీరియళ్లలో నటించిన అక్షత్ ఉత్కర్ష్‌(26) ముంబయిలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్‌కు చెందిన అక్షత్ కొన్నాళ్ల క్రితం ముంబయికి వచ్చి టీవీ సీరియళ్లలో నటిస్తున్నాడు. తనతో పాటు నటించే ఓ యువతితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు.
Samayam Telugu అక్షత్


Also Read: ‘హీరోలతో దెబ్బలు తింటేనే డబ్బులొస్తాయ్’.. 20ఏళ్ల సినీ కెరీర్‌‌పై అజయ్ స్పందన

ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాత్రూమ్‌కి వెళ్లిన అక్షత్ ఎంతసేపటికి రాకపోవడంతో స్నేహితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. వాళ్లు వచ్చి బాత్రూమ్ తలుపు తీసి చూడగా అతడు విగతజీవిగా పడివున్నాడు. దీంతో పోలీసులు అక్షత్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

Also Read: చిరంజీవితో ఆ ఛాన్స్ మిస్సయ్యా.. ఇప్పటికీ థ్యాంక్స్ చెబుతుంటా: ఎస్వీ కృష్ణారెడ్డి

అయితే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అక్షత్ తల్లిదండ్రులు అంటున్నారు. అతడు మానసిక ఒత్తిడికి గురై చనిపోలేదని, ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం అక్షత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Also Read: సుశాంత్‌ మృతి కేసు: ఎయిమ్స్‌ రిపోర్టులో సంచలన విషయాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.