రీమేక్ కావడంతో ‘2 కంట్రీస్’ సినిమాపై మినిమం గ్యారెంటీ వ్యాపారం జరిగింది, జరుగుతోంది. మలయాళంలో ఇదే పేరుతో హిట్ అయిన సినిమాను తెలుగులో సునీల్ హీరోగా రూపొందించారు. ఆ సినిమా నేడు విడుదల అయిన సంగతి తెలిసిందే. కాస్త క్రిటికల్ రివ్యూలనే పొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మకానికి సంబంధించి ఆసక్తిదాయకమైన అప్ డేట్ అందుతోంది. ఈ రెండు రకాల ప్రసార హక్కులూ కలిసి రెండున్నర కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. మలయాళంలో హిట్టైన సినిమా కావడంతో.. తెలుగు వెర్షన్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మకం సులువు అయ్యిందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు.
ఈ విధంగా సునీల్ సినిమా ఎంతో కొంత పెట్టుబడిని తిరిగి రాబట్టుకుందని సమాచారం. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఓవర్సీస్ లో, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బాగానే వ్యాపారం చేసిందట. ఈ సినిమాను ఎన్.శంకర్ స్వయంగా నిర్మించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా ఏమిటో.. రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది.