యాప్నగరం

వినాయక చవితి కానుకగా 2.0 ప్రోమో వీడియో

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 2.0 సినిమాకి

TNN 24 Aug 2017, 8:38 pm
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 2.0 సినిమాకి సంబంధించిన ప్రోమో వీడియో వినాయక చవితి సందర్భంగా రేపు ఆడియెన్స్ ముందుకురానుంది. ఇప్పటివరకు తెరకెక్కిన పలు ఆసక్తికరమైన సన్నివేశాలని ఈ గ్లింప్సె వీడియోలో చూపించనున్నట్టు స్వయంగా 2.0 మూవీ డైరెక్టర్ శంకర్ ట్వీట్ చేశాడు. రేపు సాయంత్రం 6 గంటలకి ఆ వీడియోను విడుదల చేయనున్నట్టు శంకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Samayam Telugu 2 point 0 glimpse to release tomorrow
వినాయక చవితి కానుకగా 2.0 ప్రోమో వీడియో

Glimpses of what we've been upto ...tomorrow 6pm #2point0— Shankar Shanmugham (@shankarshanmugh) August 24, 2017
దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రోబో మూవీకి సీక్వెల్‌గా వస్తోంది. అక్షయ్ కుమార్ తొలిసారిగా దక్షిణాది నుంచి తెరకెక్కుతున్న చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. సూపర్ స్టార్ సరసన అమీ జాక్సన్ జంటగా నటిస్తోంది. ఇప్పటివరకు శంకర్ డైరెక్ట్ చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు కాగా.. ఈ సినిమా మరో ఎత్తు అవుతుంది అంటున్నారు శంకర్ ప్రతిభ గురించి తెలిసిన సినీ విశ్లేషకులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.