యాప్నగరం

​ కుమారి 22f కి జరిగిన 'ఘటన'

మళయాలంలో సూపర్ హిట్ అయిన 'దృశ్యం' సినిమాను తెలుగులో అదే టైటిల్ తో వెంకటేష్ హీరోగా రీమెక్ చేసిన దర్శకురాలు శ్రీప్రియ ఇప్పుడు మరో మళయాలం మూవీ రీమేక్ తో వస్తున్నారు....

TNN 29 Sep 2016, 9:20 pm
మళయాలంలో సూపర్ హిట్ అయిన 'దృశ్యం' సినిమాను తెలుగులో అదే టైటిల్ తో వెంకటేష్ హీరోగా రీమెక్ చేసిన దర్శకురాలు శ్రీప్రియ ఇప్పుడు మరో మళయాలం మూవీ రీమేక్ తో వస్తున్నారు. మళయాలంలో హిట్ అయిన '22 ఫిమేల్ కొట్టాయం' సినిమాను తెలుగులో 'ఘటన' పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో నిత్యా మెనన్ ప్రధాన పాత్రలో నటించింది. యాక్షన్, థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Samayam Telugu 22 female kottayam movie telugu remake ghatana to be released in october
​ కుమారి 22f కి జరిగిన 'ఘటన'




దర్శకురాలు శ్రీప్రియ మాట్లాడుతూ - ''దృ శ్యం' చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌, తమిళంలో కమల్‌హాసన్‌గారు చేశారు. తెలుగులో, తమిళ్‌లో ఈ చిత్రం పెద్ద హిట్‌ అయింది. దశ్యం తర్వాత నేను తెలుగులో చేస్తున్న సినిమా 'ఘటన'. ఆడదంటే ఆటబొమ్మ కాదు, ఏదైనా చేయగల ఆది పరాశక్తి అని తెలియజేసే చిత్రమిది. సినిమా కమర్షియల్‌గా ఉంటుంది. సినిమాలో మెయిన్‌రోల్‌లో నిత్యా మెనన్ అద్భుతంగా నటించింది. సమాజంలో జరిగే విషయాలను ఈ సినిమాలో ఒక పర్సనల్‌ వ్యక్తికి జరిగినప్పుడు, ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడనేదే ఈ సినిమా'' అన్నారు.



రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ - ''సినిమా డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌. నర్సు ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్ళే అమ్మాయిలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు అనే విషయాన్ని ఒక వ్యక్తి ఆధారంగా చేసుకుని శ్రీప్రియగారు తెరకెక్కించారు. ఇలాంటి మహిళా సబ్జెక్ట్‌ను డీల్‌ చేయడానికి మహిళా దర్శకురాలే కరెక్ట్‌. శ్రీప్రియగారు సినిమాను చాలా బాగా తీశారు'' అన్నారు.



నిర్మాత వి.ఆర్‌. కృష్ణ ఎం. మాట్లాడుతూ - ''ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం'' అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.