యాప్నగరం

అంగరంగ వైభవంగా 59వ వార్షిక గ్రామీ అవార్డ్స్

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఫిబ్రవరి 12న 59వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

TNN 13 Feb 2017, 1:33 pm
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఫిబ్రవరి 12న 59వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. లాస్ ఏంజెల్స్‌లోని స్టేపుల్స్ సెంటర్ ఈ వేడుకకి వేదికైంది. 2015 అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 2016 వరకు నమోదైన అత్యుత్తమమైన రికార్డింగ్స్, కంపోజిషన్స్, ఆర్టిస్టులు పేర్లు ఈ అవార్డ్స్‌కి నామినేట్ అయ్యాయి. జేమ్స్ కార్డెన్ ఈ సెరెమనీకి హోస్టింగ్ చేశారు. జేమ్స్ ఈ అవార్డ్స్ షోను హోస్ట్ చేయడం ఇదే తొలిసారి. సీబీఎస్ నెట్‌వర్క్ ఈ సెరెమనీని ప్రత్యక్షప్రసారం చేసింది.
Samayam Telugu 59th annual grammy awards adeles hello kicked off the ceremony
అంగరంగ వైభవంగా 59వ వార్షిక గ్రామీ అవార్డ్స్


ఈ అవార్డ్స్ కోసం బియాన్స్ అత్యధిక సంఖ్యలో 9 కేటగిరీల్లో నామినేట్ కాగా ప్రముఖ సింగర్ అడెలె అత్యధిక సంఖ్యలో 5 అవార్డులు సొంతం చేసుకుంది.

'హలో' సాంగ్‌తో అడెలె ఇచ్చిన పవర్ హౌజ్ పర్‌ఫార్మెన్స్ ఈ సెరెమనీకి హైలైట్‌గా నిలవగా... ప్రెగ్నెన్సీతో వున్న బియాన్స్ ఇచ్చిన లైవ్ పర్‌ఫార్మెన్స్ మరో హైలైట్ అనిపించుకుంది. ఈ బిగ్గెస్ట్ మ్యూజిక్ నైట్‌లో పాల్గొన్న కళాకారులంతా తమ ఆటపాటలతో ఆహుతులని అలరించారు. ఎవరికి వారు తమకు ఇంకెవ్వరూ సాటి లేరన్న చందంగా పోటీ పడి మరీ పర్‌ఫామ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.