యాప్నగరం

Allu Arjun Daughter: ‘దేశముదురు’ కూతురు అనిపించిందే.. నాన్న చెప్పిన వాడ్ని చేసుకోదట

‘నాన్న.. నేను నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అని ఒక్కో మాటను బన్నీ చెప్తూ ఉంటే అర్హ.. నాన్న చెబుతున్నట్టుగానే ఎంతో ముద్దుగా చెప్తుంది. అయితే చివర్లో పెళ్లి చేసుకుంటావా? అంటే మాత్రం మాట మార్చి చేసుకోను అంటూ దేశముదురు కూతురు అనిపించింది.

Samayam Telugu 8 Feb 2019, 5:54 pm
అమ్మో.. దేశముదురుకే దేశముదురులా ఉంది బన్నీ కూతురు అర్హ. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో సరదాగా గడిపే అల్లు అర్జున్. తన కొడుకు, కూతురు‌కి సంబంధించిన వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా అలా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ‘నాన్న.. నేను నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అని ఒక్కో మాటను బన్నీ చెప్తూ ఉంటే అర్హ నాన్న.. చెబుతున్నట్టుగానే ఎంతో ముద్దుగా చెప్తుంది. అయితే చివర్లో పెళ్లి చేసుకుంటావా? అంటే మాత్రం మాట మార్చి చేసుకోను అంటూ దేశముదురు కూతురు అనిపించింది.

హేయ్ దొంగ.. చేసుకుంటాను అని చెప్పూ.. అని బన్నీ మళ్లీ అడిగినా.. చేసుకోను అని తెగేసి చెప్పేసింది. ప్లీజ్‌ రా.. నాన్న చెప్పిన అబ్బాయిని చేసుకోరా అంటే.. ఊహూ అంటూ తల ఊపి.. నో చెప్పేసింది బన్నీ కూతురు అర్హ. కూతురు ముద్దు ముద్దు మాటలకు బన్నీ తెగ ఎంజాయ్ చేయడమే కాదు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో లక్షలాది వ్యూస్‌ని కొల్లగొడుతుంది.

ఇక తండ్రీ కూతుళ్ల పెళ్లి ముచ్చటపై బన్నీ వైఫ్ స్నేహా కూడా స్పందించారు. అర్హని అడుగుతున్నావు కాని.. మీ నాన్న చెప్పిన అమ్మాయిని నువ్ చేసుకున్నావా? అంటూ ఫన్నీగా బన్నీని అడగ్గా.. ‘అబ్బా చా.. నువ్ చేసుకున్నావా మరి? ’ అంటూ ఆన్సర్ ఇచ్చారు బన్నీ. ఈ వీడియోతో పాటు ఫన్నీ చాట్‌కూడా వైరల్ కావడంతో సెలబ్రిటీలు సైతం తండ్రీకూతుళ్ల పెళ్లి ముచ్చటపై ఫిదా అవుతూ ట్వీట్‌లు చేస్తున్నారు.
View this post on Instagram My Donga fellow 😘 ❤️ A post shared by Allu Arjun (@alluarjunonline) on Feb 8, 2019 at 12:52am PST

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.