యాప్నగరం

శ్రీదేవి మీకు నటి మాత్రమే.. నాకు దేవత: అంధుడి ఆవేదన

శ్రీదేవి మనకు నటిగా మాత్రమే తెలుసు. కానీ, ఎన్నడూ సినిమాలు చూడని ఆ అంధుడు.. ఆమె గురించి చెప్పిన గొప్ప విషయం తెలిస్తే తప్పకుండా కళ్లు చెమర్చుతాయి.

TNN 28 Feb 2018, 9:10 pm
అంధుడికి సినిమాలు గురించి తెలీదు. శ్రీదేవి నటి అని తెలుసు. కానీ, కంటి చూపు లేకపోవడం వల్ల ఆమెను సినిమాల్లో చూసే అవకాశం అతనికి దక్కలేదు. ఆమె అందం, అభినయం గురించి తెలీదు. అయినా.. అతనికి శ్రీదేవి అంటే ప్రాణం. ఆమె మరణవార్త తెలియగానే ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి ముంబయికి వచ్చేశాడు. రెండు రోజులపాటు ఆమె ఇంటి ముందు పడిగాపులు కాశాడు. కళ్లారా చూడలేకపోయిన ఆ దేవత.. ఇక ఎప్పటికీ కనిపించని లోకానికి వెళ్లిపోయిందనే బాధను దిగమింగుతూ, నిద్రాహారాలు మానుకుని ఆమె కోసం వేచి చూసిన ఆ వీరాభిమాని పేరు జతిన్ వాల్మికి.
Samayam Telugu a visually impaired man is camping outside sridevis house the reason will melt your heart
శ్రీదేవి మీకు నటి మాత్రమే.. నాకు దేవత: అంధుడి ఆవేదన


శ్రీదేవి చనిపోయిందనే వార్త తెలిసిన ఆ క్షణంలో అతని జ్ఞాపకాల్లో ఆమె సినిమాలు, నటన, అందం గుర్తురాలేదు. ఆమె మానత్వం మాత్రమే కనిపించింది. ఎదుటివారి కష్టాలను చూసి కరిగిపోయే ఆమె సున్నితమైన మనస్తత్వం గుర్తుకొచ్చింది. శ్రీదేవి అంటే అతనికి ఎందుకంత అభిమానమో తెలిస్తే.. తప్పకుండా మీ హృదయం కరిగిపోతుంది.

‘‘ఓ కార్యక్రమంలో శ్రీదేవిని కలుసుకునే అవకాశం లభించింది. ఆమెతో మాట్లాడుతూ.. నా తమ్ముడు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడని చెప్పా. ఆమె వెంటనే రూ.లక్ష ఇచ్చారు. ఆ తర్వాత ఆసుపత్రి బిల్లు కట్టమని మరో రూ.లక్ష ఇచ్చారు. నేను ఆమె సినిమాలకు అభిమాని కాదు. కానీ, నా తమ్ముడికి ప్రాణం పోసిన ఆ దేవతకు కడసారి వీడ్కోలు చెప్పేందుకు వచ్చాను’’ అంటూ.. జతిన్ భావోద్వేగానికి గురయ్యాడు.

‘‘ఆమెకు నేను ఏదీ తిరిగి ఇవ్వలేనని నాకు తెలుసు. కానీ, ఆమె అంతిమ ప్రయాణంలో కనీసం పాలు పంచుకుందామని ఇక్కడికి వచ్చాను. ఆమె చనిపోయారని తెలియగానే.. యూపీ నుంచి ముంబయికి వచ్చాను. రెండు రోజులు నుంచి ఇక్కడే ఉన్నాను’’ అని తెలిపాడు.

చూశారు కదూ.. శ్రీదేవి అతిలోక సుందరే కాదు, అంతకంటే అందమైన మనస్సు ఉన్న ఓ గొప్ప మనిషి. శ్రీదేవి తల్లి కూడా బ్రెయిన్ ట్యూమర్‌తోనే చనిపోయారు. అప్పట్లో అమెరికా వైద్యులు చేసిన తప్పిదానికి ఆమె ఎంతో కుంగిపోయారు. తనకు శ్రీదేవి సాయం చేసిందని జతిన్ చెప్పే వరకు ఆ విషయం ఎవరికీ తెలీయలేదంటే.. ఆమెది ఎంత గొప్ప మనసో అర్థమవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.