యాప్నగరం

ఆది పినిశెట్టి పెళ్లి చేసుకోబోతున్నాడట!

ఓవైపు మెయిన్ హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సరైనోడు, నిన్ను కోరి లాంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి నటుడిగా...

TNN 31 Oct 2017, 8:00 pm
ఓవైపు మెయిన్ హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సరైనోడు, నిన్ను కోరి లాంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ చిత్రంలో ఓ కీల్ రోల్ పోషిస్తోన్న ఆది పినిశెట్టి అందులో తన పాత్రని త్రివిక్రమ్ తీర్చిదిద్దిన తీరు గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పవన్ కల్యాణ్‌తో కలిసి నటిస్తున్న విశేషాలని సైతం వివరించాడు ఆది పినిశెట్టి.
Samayam Telugu aadhi pinisettys wedding to be on cards soon
ఆది పినిశెట్టి పెళ్లి చేసుకోబోతున్నాడట!


ప్రస్తుతం దాదాపు అర డజన్ చిత్రాలు తన చేతిలో పెట్టుకున్న ఆది పినిశెట్టి.. పీఎస్‌పీకే 25 చిత్రం విశేషాల గురించి ఓ మీడియా హౌజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లిపై అడిగిన ప్రశ్నకు కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, వీలైనంత త్వరలోనే స్వయంగా తనంతట తానే ఆ గుడ్ న్యూస్‌ని వెల్లడిస్తానని స్పష్టంచేశాడీ స్టైలిష్ హీరో. అదండీ సంగతి.. సో ఆది పినిశెట్టి ఓ ఇంటివాడయ్యే రోజు దగ్గర్లోనే వుందన్నమాట!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.