‘నీకు గడ్డివాము దగ్గర కుక్క గురించి తెల్సా.. అది తినదు ఇంకొకర్ని తిన్నీయదు, అబ్బా నొప్పి’ అంటూ స్పైసీ లుక్స్‌తో ట్రైలర్లో రెచ్చిపోయిన యాంకర్ రష్మి ‘నెక్స్ నువ్వే’ మూవీ థియేటర్స్‌లో సందడి షురూ అయ్యింది. ఆది , వైభవి, యాంకర్ రష్మీ హీరో హీరోయిన్లుగా బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో తెరెకెక్కుతున్న హర్రర్ అండ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘నెక్స్ట్ నువ్వే’శుక్రవారం విడుదలైన ప్రేక్షకుల్లో ఫన్ని జనరేట్ చేస్తూ నవ్వులు పూయిస్తుంది. యాంకర్ రష్మి ‘గుంటూరు టాకీస్’ లాంటి మసాలాను ‘నెక్స్ట్ నువ్వే’లో ఇంకాస్త పెంచి దట్టించింది. ఈమె లుక్ స్పైసీ.. కోరికలు క్రేజీ.. పటాయించడం చాలా ఈజీ లాంటి డైలాగ్స్‌తో మాస్ ఆడియన్స్‌కు గాలం వేసింది రష్మి.
బుల్లితెరపై ఓ వెలుగు వెలిగి అందరికీ పరిచయమైన ఈటీవీ ప్రభాకర్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’.వి 4 మూవీస్ సంస్థ నుండి వస్తున్న ఈ మూవీ తమిళ ‘యామిరుక్క బయమే’ చిత్రానికి రీమేక్. తమిళంలో ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్‌తో రిలీజై హిట్ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో తమిళ బిగ్ బాస్ బ్యూటీ ఒవియా హీరోయిన్గా నటించగా క్రిష్ణ హీరోగా నటించారు. కథ, కథనంతో పాటు కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండటంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు ప్రభాకర్. హర్రర్ కామెడీ జోనర్‌తో ‘నెక్స్ట్ నువ్వే’మూవీని ఫ్రెష్ లుక్‌తో చూపించడంలో దర్శకుడు ప్రభాకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బ్రహ్మాజీ క్యారెక్టరైజేషన్ చాలా ఫన్నీగా ఉండటంతో పాటు అతని క్యారెక్టర్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. సాయికార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి.