యాప్నగరం

నవంబర్4న ప్రభాస్ పెళ్లి ?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి బాహుబలి-2 సినిమా తర్వాత అని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ పెళ్లి నవంబర్ 4న జరుగుతుంది...

TNN 2 Nov 2016, 11:50 am
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి బాహుబలి-2 సినిమా తర్వాత అని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ పెళ్లి గురించి బాహుబలి-2 తర్వాతనే మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఇంకో ప్రభాస్ పెళ్లి గురించి ఇక్కడ ప్రస్తావన. ఈ ప్రభాస్ పెళ్లి నవంబర్ 4న జరుగుతుంది. ఎక్కడంటే ఆవు- పులి మధ్యలో. ఇప్పుడు అర్థమైందా ఇక్కడ ఎవరి పెళ్లి గురించి చెప్తున్నామనేది? సరే ఇలాంటి జోక్స్ చెప్తే నవ్వు రావటం అటుంచి పిచ్చి కోపం వస్తుంది కదూ.?
Samayam Telugu aavu puli madhyalo prabhas pelli telugu film release date out now
నవంబర్4న ప్రభాస్ పెళ్లి ?




ఇక అసలు విషయానికి వస్తే.. ఏ.ర‌వితేజ‌, అశ్విని చంద్ర‌శేఖ‌ర్‌లు హీరోహీరోయిన్లుగా ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.చైత‌న్య తెరకెక్కించిన ప్రేమకథాచిత్రం 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి'. ఈ చిత్రంలో హీరో ఏ.ర‌వితేజ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కి వీరాభిమానిగా న‌టిస్తున్నాడు. సినిమాలో తనకు తాను ప్రభాస్‌ననే చెప్పుకుంటాడు. అత‌ను ప్రేమించిన అమ్మాయిగా అశ్విని చంద్ర‌శేఖ‌ర్ న‌టిస్తుంది. కాళ‌కేయ ప్ర‌భాక‌ర్ ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఆడియోకి మరియు టీజర్లకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. క్యాచీ టైటిల్ ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 4న విడుదల కాబోతుంది.



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.