యాప్నగరం

Bandla Ganesh: ఎవరి రేంజ్ వాళ్లదే.. అంతా మంగళవారం బ్యాచ్: బండ్ల గణేష్ ఆడియో వైరల్

నటుడు, బండ్ల గణేష్ (Bandla Ganesh) ఓ ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ (Aswani Dutt) చేసిన కామెంట్స్‌కు మద్దతు తెలుపుతూ ఆయన మాట్లాడారు. కాల్ షీట్లకు.. షీట్లకు తేడా తెలియని వాళ్లు కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారంటూ మండిపడ్డారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 29 Jul 2022, 9:02 am

ప్రధానాంశాలు:

  • అశ్వినీదత్‌కు బండ్ల గణేష్ సపోర్ట్
  • ఒక్కో హీరోకు ఓ రేంజ్ ఉంటుంది
  • రెమ్యూరేషన్ తగ్గించుకోవాలనడం సరికాదు
  • ఆడియో రిలీజ్ చేసిన బండ్ల
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బండ్ల గణేష్
టాలీవుడ్‌లో రోజుకో సమస్య తెరపైకి వస్తోంది. షూటింగ్స్ బంద్ చేస్తామంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ (Aswani Dutt) చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక రేపుతున్నాయి. సినిమా టికెట్ రేట్లు పెంచమని అడిగిన వాళ్లే.. ఇప్పుడు తగ్గించమని అడుగుతున్నారని అన్నారు. గతంలో నిర్మాతల సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైందని.. అయితే ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు ఏర్పాటైందో అర్థం కావడం లేదన్నారు. హీరోలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్లే.. సినిమా టికెట్ ధరలు పెంచారనేది వాస్తవం కాదని ఆయన అన్నారు.
అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలపై నటుడు, బండ్ల గణేష్ (Bandla Ganesh) ఓ ఆడియోను విడుదల చేశారు. తాను ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. అశ్వినీదత్ 50 ఏళ్లు సినీ నిర్మాణ రంగంలో ఉన్నారని అన్నారు. ఏ హీరోను.. డైరెక్టర్‌ను పారితోషికం తగ్గించుకోమని చెప్పే అర్హత లేదని.. అడగకూడదన్నారు. కార్లలో రకరకాలు ఉంటాయని.. అన్ని కార్లే అయినా ఒక్కో కారుకు ఓ రేటు ఉన్నట్లే.. అందరూ హీరోలే అయినా ఒక్కో హీరోకు ఒక రేటు ఉంటుందన్నారు. ఎవరి రేంజ్ వాళ్లకు ఉంటుందని అన్నారు బండ్ల. మనకు నచ్చి.. మనం ఎంత మార్కెట్ చేసుకోవాలో తెలిసినప్పుడు హీరోను అప్రోచ్ అయి సినిమా తీయాలన్నారు. అంతేగానీ హీరోల రెమ్యునరేషన్ తగ్గించాలనేది తప్పు వాదనంటూ ఆయన ఖండించారు.

కాల్ షీట్లకు.. షీట్లకు తేడా తెలియని వాళ్లు కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్నాంటూ ఫైర్ అయ్యారు బండ్ల గణేష్. ఏ రోజు ఏ లైట్స్ వాడుతురో.. ఏ లోకేషన్‌కి ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియని వాళ్లు సినిమాలు తీస్తున్నారని అన్నారు. తాను నటుడిగా.. ప్రొడక్షన్ మేనేజర్‌గా.. ప్రొడ్యూసర్‌గా పనిచేశానని.. తనను ఇండస్ట్రీ ఎప్పుడూ నిరుత్సాహ పరచలేదన్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇవన్నీ వేస్ట్ అని.. ఒక ఛాంబర్, కౌన్సిల్ ఉండాలని దానికి ఎప్పుడు కట్టుబడి ఉండాలని అన్నారు. సినిమాలు తీయని వాళ్లు కూడా గిల్డ్‌లో ఉన్నారని.. వాళ్లు ఏం తెలుసని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.