యాప్నగరం

అవకాశాలు లేక.. బిచ్చగాడైన తమిళ కమేడియన్

పలు తమిళ సినిమాల్లో నటించాడు, తనదైన టైమింగ్ తో కామెడినీ పండించి,​​

TNN 24 Jun 2017, 9:54 am
పలు తమిళ సినిమాల్లో నటించాడు, తనదైన టైమింగ్ తో కామెడినీ పండించి, తన రూపంతో కూడా ప్రేక్షకులను నవ్విస్తూ ‘పల్లు బాబు’గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అవకాశాలు రాకపోవడం, అదే సమయంలో తల్లిదండ్రుల మరణంతో దిక్కులేని వాడుగా మారిపోవడంతో ఇతడు బిచ్చగాడు అయ్యాడు. యాచకుడిగా బతుకీడుస్తున్నాడు. సినిమాలపై మోజుతో చెన్నై వచ్చి అడుక్కు తినేవాడయ్యాడు పల్లుబాబు.
Samayam Telugu actor became begger
అవకాశాలు లేక.. బిచ్చగాడైన తమిళ కమేడియన్


తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఒకటీ రెండు అనువాద సినిమాలతో పరిచయస్తుడే పల్లుబాబు. శంకర్ నిర్మాణంలో వచ్చిన ‘ప్రేమిస్తే’ తెలుగునాట కూడా సూపర్ హిట్ కదా.. ఆ సినిమాలో ఇతడు నటించాడు. హీరోహీరోయిన్లు లేచిపోయాకా ఆశ్రయించే ఫ్రెండ్ కు ఫ్రెండ్ గా పల్లుబాబు కనిపిస్తాడు. ఆ సినిమాలో కూడా వేషాల కోసం ప్రయత్నించే కుర్రాడిగా కనిపిస్తాడు. తను నటిస్తే హీరోగానే అని, ఆపై రాజకీయాల్లోకి కూడా వెళ్లిపోతానని.. ఎత్తుపళ్లతో ఇతడు చెప్పే డైలాగ్స్ నవ్వించాయి.

మరి సినిమాలో అలా కామెడీని పంచినా నిజ జీవితంలో మాత్రం ఇతడిని విషాదం చుట్టుముట్టింది. సినిమాల్లో అవకాశాలు లేక బతకడమే కష్టం అయ్యింది. ఇదే సమయంలో తల్లిదండ్రులు కూడా మరణించారు. అటు నమ్ముకున్న సినిమారంగంలోనూ అవకాశాలు లేక మరో పనీ చేతగాక పల్లుబాబు బిచ్చగాడిగా మారాడు. యాచన మీద ఆధారపడి బతుకుతున్నాడు. చెన్నైలోని చూలైమేడు ప్రాంతంలోని ఒక గుడి ముందు యాచిస్తున్న పల్లుబాబును సినిమా వాళ్లు కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.