యాప్నగరం

‘సైరా’ కోసం బ్రహ్మాజీ గుండు.. రోల్ ఏంటంటే!

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ 'సైరా' సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

TNN 2 Jan 2018, 1:33 pm
మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ 'సైరా' సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఖైదీ నెం.150 మూవీతో రీ ఎంట్రీలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి సొంత బ్యానర్‌లో రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా క్రియేటివ్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టాలీవుడ్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసింది.
Samayam Telugu actor brahmaji role in sye raa narasimha reddy movie leaked
‘సైరా’ కోసం బ్రహ్మాజీ గుండు.. రోల్ ఏంటంటే!


ఇక స్మాల్‌ గ్యాప్ తీసుకుని రెండవ షెడ్యూల్ కోసం ‘సైరా’ టీమ్ ఏర్పాట్లు చేస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. ఆయనకు నమ్మిన బంటులా ఉండే విభిన్నమైన పాత్రలో బ్రహ్మాజీ కనిపించనున్నారు. కథను మలుపు తిప్పే ఈ పాత్ర కోసం ఆయన గుండుతో కనిపించవలసి వుంటుందట. దాంతో ఆయన గుండు చేయించుకున్నట్టు సమాచారం.

బ్రహ్మాజీతో పాటు మరో ఇద్దరు నరసింహ రెడ్డి అనుచరులుగా మరో ఇద్దరు ఫైనల్ అయ్యారు. ఓబయ్యగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్నారు. మరోవైపు నరసింహా రెడ్డికి కుడిభుజంగా ఉంటూ ద్రోహం చేసే రోల్‌లో జగపతి బాబు నటిస్తున్నారు.ఇప్పుడు వీరితో పాటు నరసింహ రెడ్డికి అనుక్షణం కాపలా ఉండే పాత్రలో బ్రహ్మాజీ కన్ఫర్మ్ అయ్యారు. అయితే పాత్ర పేరును ఇంకా రివీల్ చేయలేదు చిత్ర యూనిట్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.