యాప్నగరం

అదే జరిగితే మా చేతికి చిప్ప ఖాయం.. సినీ నటుడు బ్రహ్మాజీ సంచలనం

కరోనా విలయతాండవానికి లాక్ వేయాలని ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ గత 50 రోజులుగా కొనసాగుతోంది. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ చేతిలో చిప్ప ఖాయం అంటూ సంచలన పోస్ట్ వదిలారు బ్రహ్మాజీ.

Samayam Telugu 14 May 2020, 11:44 am
కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవానికి ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. కోరలు చేస్తున్న కరోనాను నివారించేందుకు గాను మన దేశంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితం కలసి వచ్చింది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. సినిమా షూటింగ్స్ ఊసే లేదు. గత 50 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
Samayam Telugu అదే జరిగితే మా చేతికి చిప్ప ఖాయం.. సినీ నటుడు బ్రహ్మాజీ సంచలనం
Brahmaji


దీంతో అన్నిరంగాల్లోని కార్మికులు, దిగువ, మధ్య తరగతి ప్రజల ఆర్ధిక స్థోమత దెబ్బతింది. రోజువారీ కూలీలైతే బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూడాల్సిన రోజులొచ్చాయి. చేయడానికి పని దొరకకపోవడంతో క్రమంగా ఆకలితో అలమటించే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పొడగిస్తున్నందుకు సంతోషించాలో, బాధపడాలో అర్థంకాని స్థితిలో ఉన్నాడు సగటు మానవుడు.

కాగా.. పేదలు, మధ్యతరగతి వాళ్లే కాదండోయ్.. లాక్‌డౌన్ ఇంకా పొడిగిస్తే తమ పరిస్థితి కూడా అద్వాన్నంగా మారుతుందని పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా సంచలన కామెంట్ చేశారు సినీ నటుడు బ్రహ్మాజీ. ''లాక్‌డౌన్ ఇంకా పొడిగిస్తే ఇదీ మా పరిస్థితి'' అంటూ చిప్ప చేత పట్టుకొని ఉన్న పిక్ షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో వెంటనే వైరల్ అయింది.

Also Read: ఆ ముగ్గురికీ లభించాల్సిన గుర్తింపు లభించడం లేదు.. మంచు విష్ణు ఎమోషనల్ కామెంట్స్

ఇక ఈ ఫొటో చూసిన కొందరు నెటిజన్స్ 'కరెక్ట్ చెప్పారు సార్.. తమది కూడా అదే పరిస్థితి' అని కష్టాలు చెప్పుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం 'లాక్‌డౌన్ పొడగించకపోతే ఈ చిప్ప పట్టుకోవడానికి మనమే ఉండము సార్' అంటూ రియాక్ట్ అవుతున్నారు.

View this post on Instagram Lockdown extend ayithe maa condition ... A post shared by Actor Brahmaji (@brahms25) on May 12, 2020 at 11:44pm PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.