యాప్నగరం

నటనకు సెలవు.. ‘లోకనాయకుడు’ షాకింగ్ నిర్ణయం

డాన్సర్‌గా.. నటుడిగా.. దర్శకుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. దక్షణాది సినిమా ఇండస్ట్రీని ఏలిన కమల్ హాసన్ నటనకు స్వస్తి పలుకుతున్నారు.

Samayam Telugu 5 Dec 2018, 5:22 pm
లోకనాయకుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ నటనకు సెలవు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డాన్సర్‌గా.. నటుడిగా.. దర్శకుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. దక్షణాది సినిమా ఇండస్ట్రీని ఏలిన కమల్ హాసన్ నటనకు స్వస్తి పలికి పూర్తి స్థాయి పొలిటీషియన్ అవతారం ఎత్తనున్నారు. ఈ సందర్భంగా యాక్టింగ్‌కు గుడ్ బై చెబుతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.
Samayam Telugu kamal haasan


త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘భారతీయుడు 2’ చిత్రమే తన చివరి చిత్రమని ప్రకటించారు. ఈ చిత్రానికి 2.0 దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే రాజ్ కమల్ మూవీస్ ద్వారా సినిమాలను నిర్మిస్తానని తెలిపారు కమల్. 2019 ఎన్నికల్లో తమ పార్టీ తరుపున అభ్యర్ధుల్ని పోటీ చేయిస్తున్నామని ఈ ప్రణాళికల్లో భాగంగా సినిమాలకు దూరం అవుతున్నట్టు తెలిపారు. ఇక తన జీవితం పూర్తిగా ప్రజా జీవితానికే అంకితం అన్నారు కమల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.