యాప్నగరం

Superstar Krishna: లవ్ యూ నాన్న.. సూపర్ స్టార్ కృష్ణకు మహేష్ బాబు విషెస్, నమ్రతా ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ కృష్ణ‌కు బర్త్ డే విషెస్ చెప్పారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 31 May 2022, 11:36 am
టాలీవుడ్ అలనాటి అగ్ర హీరో సూపర్ స్టార్ కృష్ణ నేడు 80వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. షేర్ చేసుకుంటున్నారు. 344 చిత్రాల్లో హీరోగా నటించి.. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్లు అందించారు కృష్ణ. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఆయన ఎవర్‌గ్రీన్ స్టార్‌గానే ఉంటారు.
Samayam Telugu తండ్రి కృష్ణతో మహేష్ బాబు


ఈ సందర్భంగా కృష్ణ తనయడు, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా..! మీలాంటి వారు నిజంగా ఎవరూ లేరు. రాబోయే చాలా రోజుల్లో మీరు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ..' అని ట్వీట్ చేశారు.

కృష్ణ కోడలు, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'మీతో గత కొన్నేళ్లుగా మాకు చాలా ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలో చాలా ప్రేమ, నవ్వు, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. మీరు నా భర్తకు, నాకు మా అందరికీ తండ్రి అయినందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్యా.. మేము నిన్ను ప్రేమిస్తున్నాం' అని ఆమె పోస్ట్ చేశారు.
https://www.instagram.com/p/CeNSkywPQu1/

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.