యాప్నగరం

ఆ నరరూప రాక్షసుడ్ని పట్టుకోండి : వివేక హత్యతో మోహన్‌బాబు కన్నీటి పర్యంతం

నా బంధువు వివేకానందరెడ్డి. ఆయన చాలా సహజంగా జీవించే వ్యక్తి అలాంటి వ్యక్తిని దారుణంగా చంపేశారు. తొందరలోనే ఆ నరరూప రాక్షుడ్ని పట్టుకోవాలని ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను కోరుతున్నా.

Samayam Telugu 17 Mar 2019, 12:08 pm
వైఎస్ తమ్ముడు, జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి దారుణ హత్య పట్ల సినీ నటుడు మోహన్ బాబు కన్నీటి పర్యంతం అయ్యారు. శుక్రవారం నాడు వివేకానంద రెడ్డి భౌతికకాయాన్ని కొడుకు విష్ణు, కోడలు వెరొనికాతో కలిసి సందర్శించిన ఆయన వివేకానంద రెడ్డి భౌతికకాయాన్ని చూసి చలించిపోయారు.. ఒంటి నిండా బలమైన గాయాలతో దారుణ హత్యకు గురైన వివేకానంద రెడ్డి భౌతికకాయాన్ని చూసి అక్కడే కూలబడిపోయారు.
Samayam Telugu mohan babu


వైఎస్ ఫ్యామిలీతో మోహన్ బాబుకి బంధుత్వం ఉంది. మంచు విష్ణు భార్య వెరొనికాకు వైఎస్ వివేకానంద రెడ్డి బాబాయ్ కావడంతో తన చినతండ్రి భౌతికకాయాన్ని చూసి భోరున విలపించింది వెరొనికా.

కాగా ఈ హత్యారాజకీయాలపై ఘాటుగా స్పందించారు మోహన్ బాబు. ‘రాష్ట్రంలో ఈ అరాచకాలు, ఘోరాలు ఏమిటి? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయిస్తున్నారో భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. తప్పు చేసిన వాడిని ఎవర్నీ భగవంతుడు విడిచిపెట్టడు.

వివేకానంద రెడ్డి గురించి ఆయన పార్టీ వాళ్లే కాకుండా బయట పార్టీ వాళ్లు కూడా చాలా మంచిగా చెబుతారు. ఆయన ధర్మరాజు. ఎవరికీ హానిచేయరు. ఆయన అజాతశత్రువు, మనసున్న వ్యక్తి. ఎవరికి అన్యాయం చేయరు. పదిమందికి సాయం చేసే మంచి వ్యక్తికే అలా జరిగింది అంటే ఎందుకు జరిగింది? ఏం జరిగింది అన్నది భగవంతుని నిర్ణయం.

దీనికి పోలీసులు, అధికారులు జాగ్రత్తతో నిజాలను తొక్కిపెట్టేయకుండా.. అసత్యాలు ఆడకుండా న్యాయబద్ధంగా ఆ రాక్షకుడ్ని పట్టుకోవాలని వేడుకుంటున్నా. నా ఆత్మీయుడు అని కాదు ఏ వ్యక్తికి ఇలా జరగకూడదు. ఈరోజు పక్షపాతం చూపిస్తే.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ రాత్రి పగలూ ఉంటుంది. అది మరిచిపోయి ప్రవర్తించకూడదు.

నా బంధువు వివేకానందరెడ్డి. ఆయన చాలా సహజంగా జీవించే వ్యక్తి అలాంటి వ్యక్తిని దారుణంగా చంపేశారు. తొందరలోనే ఆ నరరూప రాక్షుడ్ని పట్టుకోవాలని ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను కోరుతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు మోహన్‌బాబు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.