యాప్నగరం

మోహన్ బాబు ఇంట విషాదం.. మనోజ్ భావోద్వేగ ట్వీట్

ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మంచు లక్ష్మమ్మ గురువారం ఉదయం కన్నమూశారు.

Samayam Telugu 20 Sep 2018, 9:59 am
సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి మంచు లక్ష్మమ్మ (85) గురువారం ఉదయం ఆరు గంటలకు కన్ను మూశారు. తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్ బాబు కుటుంబం లక్ష్మమ్మ మరణ వార్త వినగానే తిరిగి ఇండియాకు బయల్దేరింది. శుక్రవారం తిరుపతిలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Samayam Telugu manchu-laxmamma


ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరో మంచు మనోజ్ తన నానమ్మ మరణ వార్తను ధ్రువీకరించారు. ‘మా నానమ్మ లక్ష్మమ్మ గారు ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. నిన్ను మిస్సవుతున్నాం నాన్నమ్మ. ఇప్పుడు మేం ఇండియాలో లేకపోవడం తీవ్రంగా బాధిస్తోంది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాం. తన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని మంచో మనోజ్ ఉద్వేగంగా ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.