యాప్నగరం

Pawan Kalyan: ఇది ‘మా’కి సంబంధించిన విషయం.. పవన్‌‌కి ఆవేశం.. ఆయనో రాజకీయ నాయకుడు: ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని పవన్ తీవ్ర ఆరోపణలు చేస్తే.. ప్రభుత్వం చిత్ర పరిశ్రమ పట్ల సానుకూలంగానే ఉందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో తమకి సంబంధం లేదని జలక్ ఇచ్చింది తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌. ఈ నేపథ్యంలో మా ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 27 Sep 2021, 6:17 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన పొలిటికల్ కామెంట్స్.. సినీ, రాజవర్గాల్లో కాకరేపుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం నష్టం కలిగిస్తోందంటూ ఆయన చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపాయి. దీంతో వైసీపీ వర్సెస్ జనసేన మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఒకర్నొకరు దుమ్మెత్తిపోసుకుంటూ ఒకడు సన్నాసి అంటే.. ఇంకొకడు సన్నాసిన్నర అంటూ వారి వారి వ్యక్తిత్వాలను బయటపెట్టుకుని నవ్వుల పాలౌతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమకి సంబంధం లేదని అది ఆయన వ్యక్తిగతం అంటూ కీలక ప్రకటన చేసింది.
Samayam Telugu ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్
Prakash Raj On Pawan Kalyan


చిత్ర పరిశ్రమ మనుగడ సాగించాలంటే ప్రభుత్వాల మద్దతు అవసరం అంటూ పవన్ కళ్యాణ్‌కి ఇన్ డైరెక్ట్‌గా చురకలు వేశారు. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా స్పందించిందని.. సీఎం జగన్ హామీ కూడా ఇచ్చారని వ్యక్తిగత అభిప్రాయలను ఇండస్ట్రీ సమస్యగా చూపిస్తారంటూ పవన్‌కి పంచ్ వేసింది తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌.

ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగంలో మా ఎన్నికలు.. ప్రకాష్ రాజ్.. మోహన్ బాబు తదితరులు గురించి కూడా ప్రస్తావించారు. అయితే మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ సోమవారం నాడు నామినేషన్ వేశారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘ఈ ఎన్నికలు సవ్యంగా దోషారోపణలు లేకుండా జరగాలని కోరుకుంటున్నా.. మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ.. ఇది రాజకీయ పార్టీల ఎలక్షన్స్ కాదు. ‘మా’ ఎలక్షన్స్ అనేది మా సభ్యుల మధ్య జరిగే ఎలక్షన్. ఇందులో రాజకీయ పార్టీల జోక్యం వద్దు.

ఇందులో ఏపీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ మెంట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు. తన సిద్దాంతాల ప్రకారం ఆయన పోరాడుతున్నాడు అది మంచిదే. ఆయన కూడా మా అసోసియేషన్ మెంబరే. ప్రతి ఒక్కరికీ ఆవేశం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సిద్ధాంతాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఆవేశం ఉంది.. ఆయన మార్గం ఉంది.. అది ఆయన హక్కు. దయచేసి ఆయన పొలిటికల్ కామెంట్స్ గురించి నన్ను అడగొద్దు ప్లీజ్. ఇండస్ట్రీకి సంబంధించినదే అయినా మా ఎన్నికల తరువాత మాట్లాడతా. స్పందించడం నా బాధ్యత కాబట్టి అప్పుడు మాట్లాడతా’ అని అన్నారు ప్రకాష్ రాజ్.

అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో దోస్తి కట్టడంతో అప్పట్లో ఫైర్ అయ్యారు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అంటూ హాట్ కామెంట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ గేమ్ ఏంటో నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఆయన చేస్తున్న రాజకీయాలను చూసి చాలా నిరుత్సాహంగా ఉన్నాను. జనసేన అని ఒక పార్టీని స్థాపించుకున్నప్పుడు.. ఆ పార్టీకి పనిచేయకుండా ఇంకో పార్టీ నాయకుడి తరపున పనిచేయడం ఏంటి?? ఆంధ్రాలో బీజేపీ ఓటు షేర్ ఎంత? జనసేన ఓటు షేర్ ఎంత? మీకంటే తక్కువ ఓటు షేర్ ఉన్న బీజేపీ భుజాన్ని ఎక్కడం దేనికి? 2014లో చంద్రబాబు అద్బుతం.. ఇంద్రుడు చంద్రుడు అని ఆయన్ని సపోర్ట్ చేశారు.

2019 ఎలక్షన్స్‌లో వాళ్లు ద్రోహం చేశారని వెనక్కి వచ్చారు.. ఇప్పుడు మళ్లీ ఆయనే నాయకుడిగా కనిపిస్తున్నాడు. అంటే పదే పదే మాటలు మారుస్తూ పార్టీలు మారుస్తున్నారంటే ఆయన ఊసరవెల్లి అయ్యి ఉండాలి. దేశ హితం కోసం అని కబుర్లు చెప్తుంటే జనం నమ్ముతారా? బీజేపీని పవన్ కళ్యాణ్ ప్రజలు నమ్మితే ఏపీలో అధికారంలో ఉండేవారు కదా.. అంటూ అప్పట్లో పవన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు ప్రకాష్ రాజ్. అయితే ఆ తరువాత ఇద్దరూ కలిసి వకీల్ సాబ్ చిత్రంలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.