యాప్నగరం

నటకిరీటీ రాజేంద్రుడికి మరో అరుదైన గౌరవం

భారతదేశం నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి నటుడిగా రాజేంద్రప్రసాద్ చరిత్ర సృష్టించారు.

Samayam Telugu 18 Sep 2018, 5:10 pm
టాలీవుడ్ నటుడు, ‘నటకిరీటీ’ రాజేంద్రప్రసాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల న్యూజెర్సీలోని జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్‌ ‘సెనేట్ లైఫ్ అచీవ్‌మెంట్’ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.
Samayam Telugu Actor Rajendra Prasad


సిడ్నీలోని పార్లమెంట్ హాలులో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అందులో భాగంగా ఆస్ట్రేలియా సాంస్కృతిక శాఖ రాజేంద్రప్రసాద్‌కు అరుదైన గౌరవాన్ని కల్పించింది. నటుడిగా విశిష్ట సేవలు అందించిన నటకిరీటీ రాజేంద్రుడికి జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. భారతదేశం నుంచి నటుడిగా ఈ పురస్కారం అందుకున్న తొలి ఆర్టిస్టుగా రాజేంద్రప్రసాద్ చరిత్ర సృష్టించారు.

నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో దాదాపు 240 సినిమాల్లో నటించారు రాజేంద్రప్రసాద్. నటుడిగా ఎంత రాణించినా.. దర్శకనిర్మాతలు, ప్రేక్షకుల ఆదరణే అందుకు కారణమని నిర్మొహమాటంగా చెప్పేవ్యక్తి ఆయన. ఈ ఏడాది మే నెలలో న్యూజెర్సీ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న రాజేంద్రుడు.. తన అవార్డును తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌కు అంకితం చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.