యాప్నగరం

'రజినీ' చదివిన పాఠశాలకు కొత్త హంగులు..!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చదువుకున్న పాఠశాల కొత్త హంగులు దిద్దుకుంది. బెంగళూరులోని గవిపురంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలను కొందరు దాతల సహకారంతో కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో 'మహానగర పాలికె' అభివృద్ధి చేసింది.

TNN 25 Mar 2018, 5:09 pm
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చదువుకున్న పాఠశాల కొత్త హంగులు దిద్దుకుంది. బెంగళూరులోని గవిపురంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలను కొందరు దాతల సహకారంతో కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో 'మహానగర పాలికె' అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రి అనంతకుమార్‌, స్థానిక ఎమ్మెల్యే రవి సుబ్రహ్మణ్య, ఎమ్మెల్సీ శరవణలు సంయుక్తంగా ఈ పాఠశాలను మార్చి 24న ప్రారంభించారు.
Samayam Telugu actor rajinis alma mater govt school gets swanky
'రజినీ' చదివిన పాఠశాలకు కొత్త హంగులు..!


పేద విద్యార్థులు సులభంగా చదువుకునేందుకు అనువైన బోధన కేంద్రాల (లెర్నింగ్‌ సెంటర్ల) ఏర్పాటుకు రూ.50 లక్షలు తన నిధి నుంచి కేటాయిస్తున్నట్లు అనంతకుమార్‌ వెల్లడించారు. ఈ కేంద్రాల్లో విద్యుద్దీపాలు, మేజా బల్లలు, గ్రంథాలయం తదితర సదుపాయాలు ఉంటాయని చెప్పారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నానంటూ బాల్యస్మృతులను గుర్తు చేసుకున్నారు. పాఠశాలకు సమీపంలోని తాగు నీటి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాజకీయ పార్టీ ఏర్పాటులో తీరిక లేకుండా ఉన్న.. రజనీకాంత్‌ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. రజినీకాంత్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు రజని మురుగన్‌, స్థానిక కార్పొరేటర్‌ కెంపేగౌడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.