యాప్నగరం

రవితేజ డ్రగ్స్ తీసుకోవడం ఏంటి? అంతా అబద్దం!

టాలీవుడ్‌ డ్రగ్స్ ప్రకంపనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే.. తాజాగా డ్రగ్స్ రాకెట్‌‌పై హీరో శివాజీ స్పందించారు.

TNN 14 Jul 2017, 3:08 pm
టాలీవుడ్‌ డ్రగ్స్ ప్రకంపనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే.. తాజాగా డ్రగ్స్ రాకెట్‌‌పై హీరో శివాజీ స్పందించారు. డ్రగ్స్ అనేది వ్యక్తిగతం దాన్ని సినిమా ఇండస్ట్రీకి ఆపాదించడాన్ని పూర్తిగా తప్పుపట్టారు శివాజీ. సినిమాలో ఉన్న 24 క్రాప్ట్స్‌లో డ్రగ్స్ అనేది ఒక క్రాప్ట్ కాదు. .. అసలు ఇండస్ట్రీకి డ్రగ్స్‌కి సంబంధం ఏంటి? ఇండస్ట్రీని మొత్తం డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా చూపడం. ఒకవేళ అలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉంటే చట్టం తన పని చేసుకుపోతుందని అన్నారు.
Samayam Telugu actor sivaji reacts on drug racket in tollywood
రవితేజ డ్రగ్స్ తీసుకోవడం ఏంటి? అంతా అబద్దం!


ఈ డ్రగ్స్ కేసులో హీరో రవితేజ పేరును తెరపైకి తేవడం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని.. ‘తనకు రవితేజ 20 సంవత్సరాలుగా తెలుసు.. రవితేజ ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకోడు. అతనే కాదు లిస్ట్‌లో ఉన్న 12 మందిలో తొంబై శాతం మంది ఖచ్చితంగా ఈ వివాదం నుండి బయటకు వస్తారన్నారు. లోపం ఎక్కడుంతో పట్టుకోకుండా సినిమా వాళ్లు నంబర్లు కెల్విన్ దగ్గర ఉన్నంత మాత్రానా ఇండస్ట్రీ మొత్తం తప్పుచేసినట్లేనా? అని ప్రశ్నించారు. సెలబ్రిటీ ఫోన్‌ నంబర్లకోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారని.. అలాగే అతనికి నంబర్లు వచ్చి ఉంటాయని నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు.

నేను ఓ రేప్ కేసులో ఇరుక్కుంటే.. ఇండస్ట్రీ మొత్తం రేప్ చేసినట్టేనా అని ప్రశ్నించారు. కుటుంబంలో అందరూ మంచి వాళ్లే ఉండరని.. ఎవడో ఒకడు ఎదవ ఉంటాడని అంత మాత్రం చేత కుటుంబం చెడ్డది కాదన్నారు. ఇదివరకూ కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని నిరూపించలేకపోయారని ఇలాంటి వాటివల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు రావడంతోపాటు.. వాళ్ల కెరియర్ నాశనం అవుతుందని వాపోయారు శివాజీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.