యాప్నగరం

రియల్ హీరో: అంధవిద్యార్థులకు అరకోటి విరాళం

హీరోలు చాలామందే ఉంటారు.. కానీ రియ‌ల్ హీరోలు అరుదుగా కనిపిస్తుంటారు.

TNN 12 Nov 2017, 3:33 pm
హీరోలు చాలామందే ఉంటారు.. కానీ రియ‌ల్ హీరోలు అరుదుగా కనిపిస్తుంటారు. ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడం తన బాధ్యతగా భావించి రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో అని నిరూపించుకున్నాడు తమిళ హీరో విజయ్ సేతుపతి. దక్షణాదిలో ఉన్న ఇండస్ట్రీల్లో కోలీవుడ్ హీరోలు మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే సామాజిక అంశాలపై యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల తమిళనాడులో సంభవించిన వరుస పరిణామాలపై తమవంతుగా వాయిస్ వినిపించిన తమిళ హీరోలు జల్లికట్టు సమయంలో ప్రజలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడెక్కి మేం ఉన్నాం అంటూ ముందుకు వచ్చారు. ఇటీవల వరదల సమయంలోనూ తమ వంతు సాయాన్ని అందిస్తూనే ఉన్నారు. తాజాగా కోలీవుడ్‌లో వరుస సినిమాలతో పాపులర్ హీరోగా మారిని విజయ్ సేతుపతి రూ. 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించి ఉదారతను చాటుకున్నాడు.
Samayam Telugu actor vijay sethupathi donates rs 50 lacs to ariyallur kids
రియల్ హీరో: అంధవిద్యార్థులకు అరకోటి విరాళం


‘అనిల్ సేమియా’ ప్రోడక్ట్స్‌కు ప్రచార కర్తగా ఉన్న విజయ్ సేతుపతి ఆ కంపెనీతో రూ.50 లక్షల డీల్ కుదుర్చుకున్నాడు. ఇటీవల ఆ కంపెనీ కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకి విడుదల కావడంతో లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ సేతుపతి.. ‘అనిల్ సేమియా’ సంస్థనుండి తాను పొందిన అరకోటిని తమిళనాడులోని అలియలూర్ జిల్లాలో ఉన్న అంధుల పాఠశాల విద్య-మౌళిక వసతుల కల్పన కోసం వినియోగించాల్సిందిగా కోరుతూ విరాళంగా ప్రకటించారు. ఈ జిల్లాలో 10 అంధుల పాఠశాలలు ఉండగా.. 11 బధిర పాఠశాలలు ఉన్నాయి. వీటిన్నింటికీ కలిపి అరకోటిని విరాళంగా ప్రకటించిన మిగిలిన హీరోలకు ఆదర్శంగా నిలిచాడు విజయ్ సేతుపతి. కాగా ఈయన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రం ‘సైరా’లో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.