యాప్నగరం

గ్రాండ్‌గా వైవా హర్ష నిశ్చితార్థం.. వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయిన మెగా హీరోలు!

యూట్యూబ్ స్టార్‌గా ఫేమస్ అయి సినిమాల్లో కూడా ఛాన్స్ పట్టేసిన వైవా హర్ష నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్ బ్రదర్స్ హాజరయ్యారని తెలిసింది.

Samayam Telugu 10 Jan 2021, 2:52 pm
గత కొన్ని నెలలుగా చిత్రసీమలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు యూట్యూబ్ స్టార్, కమెడియన్ వైవా హర్ష. ఈ మేరకు తన నిశ్చితార్ధ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అక్షర అనే అమ్మాయితో అతని ఎంగేజ్‌మెంట్ జరిగింది. కేవలం కొద్దిమంది మిత్రులతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్, కొణిదెల సుస్మిత ఈ వేడుకకు హాజరయ్యారని తెలుస్తోంది.
Samayam Telugu గ్రాండ్‌గా వైవా హర్ష నిశ్చితార్థం..
Viva Harsha engagement


తన నిశ్చితార్ధానికి మందు దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైవా హర్ష 'ఇదే లాస్ట్ బ్యాచిలర్ సెల్ఫీ' అంటూ ఆసక్తికర కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు ప్రముఖులు, యూట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియా స్టార్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా తన పెళ్లి డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు వైవా హర్ష.
కరోనా లక్షణాలంటూ అనసూయ షాకింగ్ పోస్ట్.. మెగా ఫ్యామిలిలో టెన్షన్ పుట్టించిన జబర్దస్త్ బ్యూటీ!
యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వైవా హర్ష నెటిజన్లకు బాగా దగ్గరయ్యాడు. సోషల్ మీడియా ద్వారా కూడా సినిమాల్లో ఛాన్సులు అందుకోవచ్చని నిరూపించిన వారిలో వైవా హర్ష ఒకరు. కేవలం యూ ట్యూబ్ వీడియోల ద్వారా దాదాపు సెలబ్రెటీల రేంజ్‌లో క్రేజ్ కొట్టేసిన హర్ష.. పలు సినిమా అవకాశాలు పట్టేశాడు. రీసెంట్‌గా వైవా హర్ష నటించిన కలర్ ఫోటో మూవీ సక్సెస్ అయింది. ఈ చిత్రంలో తన నటనతో అందరి మనసు దోచుకున్న వైవా హర్ష ప్రస్తుతం మెగా డాటర్ సుస్మిత నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు.
View this post on Instagram A post shared by Harsha (@harshachemudu)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.