యాప్నగరం

Anasuya: కేటీఆర్‌ ట్వీట్‌కు అనసూయ రిప్లై.. రాజకీయం చేయవద్దంటూ రిక్వెస్ట్

ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉంది యాంకర్ అనసూయ (Anchor Anasuya). తాజాగా అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన ట్వీట్స్‌ను రాజకీయం చేయవద్దంటూ ఆమె కోరుతోంది.

Authored byAshok Krindinti | Samayam Telugu 19 Aug 2022, 3:15 pm
ఇటీవలె జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన యాంకర్ అనసూయ (Anchor Anasuya) ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉంటోంది. గత నెలలో దర్జా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనసూయ.. త్వరలో వరుస చిత్రాలతో ఆడియన్స్‌ను అలరించనుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై పలు షోలకు యాంకర్‌గా కంటిన్యూ అవుతోంది. తాజాగా అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. తన చెప్పే అభిప్రాయాలకు రాజకీయ రంగు పూయొద్దంటూ నెటిజన్లను కోరింది.
Samayam Telugu Anchor Anasuya
యాంకర్ అనసూయ


ఇటీవల గుజరాత్‌కు చెందిన బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచార కేసులో జైలు నుంచి దోషులు విడుదలైన సంగతి తెలిసిందే. వారికి ఓ సంస్థ సన్మానం చేయగా.. మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేస్తూ.. 'దారుణం! మనం స్వేచ్ఛను పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది.. అంటే రేపిస్టులను విడిచిపెట్టి.. మహిళలను ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం..' అంటూ ఆమె రాసుకొచ్చింది. అయితే ఈ ట్వీట్‌పై అనసూయకు నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో మైనర్‌పై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని అడిగారు.

దీంతో తన వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దంటూ అనసూయ తాజాగా ట్వీట్ చేసింది. A, B, C అంటూ అనసూయ రాసుకొచ్చింది. తాను ఏ ట్వీట్ చేసినా అది తన సొంత ఆసక్తి మాత్రమేనని చెప్పింది. తాను ఎవరినీ ప్రమోట్ చేసేందుకో.. డబ్బుల కోసమో ట్వీట్స్ చేయడం లేదని తెలిపింది. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునే తాను మాట్లాడుతానని చెప్పింది అనసూయ. ఒకవేళ తాను ఏదైనా మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని.. అందుకే తాను ఓ సొంత నిర్ణయానికి రాలేకపోతున్నానంటూ అనసూయ ట్వీట్ చేసింది. తన ట్వీట్స్‌ను రాజకీయం చేయవద్దంటూ నెటిజన్లను కోరింది.

'అలాంటప్పుడు మీరు రాజకీయ ట్వీట్లను రీట్వీట్ చేయకపోవడమే మంచిది. ముందు మీరు ఆర్టిస్ట్.. ఇది అంగీకరించండి..' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'నేను ముందు మనిషిని.. తర్వాత స్త్రీని.. తర్వాతే అన్నీ.. అలాగే నేరస్థులను విడిపించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన నేను చేసిన ట్వీట్ ఎప్పుడు రాజకీయంగా మారిందో చెప్పండి..?? క్షమించండి.. మీరు రాజకీయ నాయకులా..?? ఎందుకంటే దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలపై.. ముఖ్యంగా మహిళలపై.. ప్రతిస్పందించడం కేవలం రాజకీయ బాధ్యతగా మీ అభిప్రాయంగా కనిపిస్తోంది..' అంటూ అనసూయ రిప్లై ఇచ్చింది. అనసూయ వరుసగా ట్వీట్స్ చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏమైంది మేడమ్ అని అడుగుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.