యాప్నగరం

రాజశేఖర్‌ని వాళ్లే రక్షించారు: అసలు విషయం చెప్పిన జీవిత

ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదఘటనపై క్లారిటీ ఇచ్చారు ఆయన సతీమణి జీవితా రాజశేఖర్. నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? ఎవరు కాపాడారు అన్న విషయంపై వివరణ ఇచ్చారు.

Samayam Telugu 13 Nov 2019, 12:36 pm
హీరో రాజశేఖర్ కారు ప్రమాదంపై వివరణ ఇచ్చారు జీవిత. రాజశేఖర్‌కి మేజర్ యాక్సిడెంట్ జరిగిందని.. అభిమానుల బ్లెస్సింగ్‌తో ఆయన చిన్న చిన్న దెబ్బలతో బయటపడగలిగారన్నారు జీవిత. ఆవిడ మాట్లాడుతూ.. రాజశేఖర్‌కి యాక్సిడెంట్ వార్తపై ఆయన అభిమానులు చాలా టెన్షన్ పడుతున్నారు. నాకు చాలా మంది కాల్ చేసి రాజశేఖర్ గారు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. అక్కడ జరిగిన వాస్తవం ఏంటన్నదానిపై క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. టీవీలో వెబ్ సైట్స్‌లో రాజశేఖర్ యాక్సిడెంట్‌పై రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు జరిగింది ఏంటంటే.. నిన్న రాత్రి ఆర్ ఎఫ్ సీ (రామోజీ ఫిల్మ్ సిటీ) నుండి రాజశేఖర్ రిటర్న్ వస్తున్నారు. ఆయన బెంజ్‌లో ట్రావెల్ చేస్తున్నారు. రాత్రి 10.30 అవుతుంది. ఆయన కారు టైర్ బ్లాస్ట్ కావడం వల్ల కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది.
Samayam Telugu Rajasekhar  Car Accident
రాజశేఖర్ కార్ యాక్సిడెంట్


అదే సమయంలో ఆపోజిట్‌లో వస్తున్న ఒక ఫ్యామిలీ తమ కారును ఆపి కారులో రాజశేఖర్ ఉన్నట్టు గమనించారు. వాళ్ల హెల్ప్‌తో కారు నుండి బయటకు వచ్చారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆయన్ని రక్షించిన వాళ్ల ఫోన్ నుండే పోలీస్‌లకు, నాకు కూడా కాల్ చేశారు. ఆ ఫ్యామిలీ రాజశేఖర్‌ను రక్షించారు.

ఆ తరువాత రాజశేఖర్ వాళ్ల కారులోనే మాకు ఎదురు వచ్చారు. అనంతరం మా కారులో ఆయన్ని ఎక్కించుకుని ఇంటికి వచ్చేశాం. అప్పటి నుండి పోలీస్ లకు టచ్‌లోనే ఉన్నాం. నైట్ డ్యూటీలో ఉన్న శ్యామ్‌గారితో మాట్లాడం. వాళ్ల ఎంక్వైరీ వాళ్లు చేశారు. రాజశేఖర్ గారితో కూడా పోలీసులు మాట్లాడారు.

మా ఇంటికి వచ్చిన తరువాత రాజశేఖర్ గారికి ట్రీట్ మెంట్ చేయించాం. డాక్టర్ వచ్చి ప్రమాదం ఏం లేదన్నారు. చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. పెయిన్ కిల్లర్స్ ఇచ్చి డాక్టర్ మా ఇంటి నుండి వెళ్లిపోయారు.

అయితే రాజశేఖర్‌కి బెటర్ అయిన తరువాత స్టేషన్‌కి వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వమని పోలీసులు కోరారు. దానికి మేం ఓకే అని అన్నాం. జరిగింది ఇది. ఇది మేజర్ యాక్సిడెంట్. కాని ఆయన్ని ప్రేమించే అభిమానుల బ్లెస్సింగ్‌తో ఆయన ప్రమాదం నుండి బయటపడ్డారు’ అంటూ ఈ ప్రమాద ఘటనలపై వస్తున్న వివిధ కథనాలపై స్పందించారు జీవిత.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.