యాప్నగరం

శర్వానంద్‌కు కాజల్ ఝలక్!

టాలీవుడ్ సీనియర్ బ్యూటీ.. అందాల చందమామ కాజల్ యంగ్ హీరోకి ఝలక్ ఇచ్చింది.

TNN 31 Oct 2017, 5:45 pm
టాలీవుడ్ సీనియర్ బ్యూటీ.. అందాల చందమామ కాజల్ యంగ్ హీరోకి ఝలక్ ఇచ్చింది. శర్వానంద్‌తో నటించేందుకు నో చెప్పేసింది. వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న శర్వానంద్ మినిమమ్ గ్యారంటీ స్థాయినుండి టాప్ హీరోలతో పోటీ పడే స్థాయికి ఎదిగాడు. గత సంక్రాంతి సీజన్‌లో సీనియర్ హీరోలు చిరు, బాలయ్యలో పోటీ పడి మరీ శతమానం భవతి మూవీతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో తాజాగా మహానుభావుడు మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Samayam Telugu actress kajal aggarwal refuse to movie with sharwanand
శర్వానంద్‌కు కాజల్ ఝలక్!


తాజాగా వరుస సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా మారిగా శర్వానంద్ నిర్మాతల హీరోగా మారడంతో ఈయనతో సినిమా తీసేందుకు పోటీ పడుతున్నారు. తాజాగా శర్వానంద్.. సుధీర్ వర్మ డైరక్షన్‌లో నటిస్తున్నాడు. ఇప్పటివరకూ యంగ్ హీరోగానే కనిపించిన శర్వానంద్ ఈ సినిమాలో వినూత్నంగా డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఇందులో ఒకటి లవర్ బాయ్ పాత్ర కాగా.. మరొకటి మిడిల్ ఏజ్ క్యారెక్టర్.

అయితే మధ్య వయస్కుడి క్యారెక్టర్‌కు జోడీగా నటించేందుకు అందాల చందమామ కాజల్ సంప్రదిస్తే.. అబ్బే ఆ హీరోతోనా అదీ మిడిల్ ఏజ్ క్యారెక్టర్ పక్కన అంటే కష్టమే అంటూ సింపుల్‌గా నో చెప్పేసిందట. కావాలంటే రెమ్యూనరేషన్ కూడా బాగానే ముట్టచెప్తాం అన్నా ససేమిరా అందంట కాజల్. దీంతో చేసేది లేక కాజల్ ప్లేస్‌ను మిల్కీ బ్యూటీ తమన్నాతో రీప్లేస్ చేశారట మేకర్స్.

అయితే శర్వానంద్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి కారణం అతడి వరుస హిట్‌లు కాజల్‌కు కనిపించడంతో లేదా అంటూ శర్వా అభిమానులు గుర్రుగా ఉన్నారు. తక్కువ స్టార్‌డమ్ ఉన్న హీరోతో నటిస్తే.. తన ఇమేజ్‌కి డ్యామేజ్ అయ్యే అవకాశం లేకపోలేదని ఈ ముద్దుగుమ్ము ముందే సేఫ్ జోన్‌ వెతుక్కుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.