యాప్నగరం

ఆగని కరాటే కళ్యాణి పోరాటం.. ఆ యూట్యూబర్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

అసభ్యకర ఫ్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌పై నటి కరాటే కళ్యాణి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఆమె పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 27 May 2022, 5:53 pm

ప్రధానాంశాలు:

  • యూట్యూబర్స్‌పై పోలీసులకు కరాటే కళ్యాణి ఫిర్యాదు
  • ఆధారాలతో సహా స్టేషన్‌కు..
  • కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కరాటే కళ్యాణి
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి తరువాత ఆమె ఒక్కసారిగా వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఆ తరువాత చిన్నారి దత్తత ఇష్యూపై కళ్యాణిపై తీవ్ర ఆరోపణలే వచ్చాయి. చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు హాజరై.. క్లీన్‌చీట్ తెచ్చుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలతో సమాధానం ఇచ్చారు. తనను వేధించిన ఎవరినీ వదిలిపెట్టను అని చెప్పిన ఆమె.. ఆ దిశగా అడుగులు మొదలుపెట్టారు.
అసభ్యకర ఫ్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌పై సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 యూట్యూబ్ ఛానెల్స్‌పై కరాటే కళ్యాణి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలతో సహా ఆమె పోలీసులకు సమర్పించారు. ఈమేరకు సీసీఎస్ పోలీసులు ఐటీ యాక్ట్‌లోని 67A,509 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యూట్యూబ్ ఛానల్స్‌కు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు.

మరోవైపు ఇప్పటికే పోలీసులు ఆయా యూట్యూబ్ ఛానెల్స్‌పై నిఘా ఉంచారు. కరాటే కళ్యాణి సాక్ష్యాలతో సహా ఇచ్చిన 20 యూట్యూబ్ ఛానెల్స్‌పై విచారణ చేపట్టేందుకు పోలీసులు ఒక ప్రత్యేక టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ టీమ్ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది.

శ్రీకాంత్ రెడ్డి వర్సెస్ కరాటే కళ్యాణి

యూట్యూబ్‌లో వల్గర్ వీడియోలు చేస్తూ.. మహిళలను, హిందువులను అగౌరవ పరిచేలా చేస్తున్నాడని యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి గతంలో దాడి చేశారు. హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలో తన అనుచరులతో కలిసి ఆమె శ్రీకాంత్ రెడ్డి చెంప చెల్లుమనిపించింది. దీంతో శ్రీకాంత్ రెడ్డి కూడా ఎదురుదాడికి దిగాడు. తనపై దాడి చేసిన కరాటే కళ్యాణి చెంపలపై కొట్టాడు. ఈ ఘటన వీడియోను కళ్యాణి తన ఫేస్‌బుక్‌లో లైక్ కూడా పెట్టారు. దీంతో వీడియోలు వైరల్ అయ్యాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ.. చివరికి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.