యాప్నగరం

కరాటే కళ్యాణికి క్లీన్‌చీట్.. ఇక వారిపై లీగల్ యాక్షన్‌కు రెడీ!

చైల్డ్ వెల్ఫేర్ అధికారుల విచారణ పూర్తయిందని.. అధికారులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని నటి కరాటే కళ్యాణి తెలిపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు వేసిన వారిపై త్వరలో కోర్టుకు వెళ్తానని స్పష్టంచేశారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 18 May 2022, 7:38 pm
చిన్నారి దత్తత ఇష్యూపై నటి కరాటే కళ్యాణి చైల్డ్ వెల్ఫేర్ విచారణ కొద్ది సేపటి క్రితమే ముగిసింది. విచారణ అనంతరం కరాటే కళ్యాణి దగ్గర ఉన్న పాపను సీడబ్ల్యూసీ కమిటీ మెంబర్స్ తల్లిదండ్రులకు అప్పగించారు. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కావడంతో.. అధికారులు ఈ కేసును రంగారెడ్డి అధికారులకు బదిలీ చేశారు. దత్తత తీసుకునే విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని అధికారులు సూచించారు.
Samayam Telugu కరాటే కళ్యాణి


అనంతరం కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. చైల్డ్ వెల్ఫేర్ అధికారుల విచారణ పూర్తయిందని.. అధికారులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు వేసిన వారిపై త్వరలో కోర్టుకు వెళ్తానని చెప్పారు. తాను పాపను దత్తత తీసుకోలేదని.. దత్తత తీసుకుంటే లీగల్‌గానే తీసుకుంటానని అన్నారు. తాను ఎప్పుడు విచారణకు రమ్మన్నా కూడా వస్తానని అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు.

గత రెండు రోజులుగా తనపై అనేక ఆరోపణలు వస్తున్నాయని.. ఏం జరిగిందో తెలుసుకోకుండా కొంతమంది దుష్ప్రచారం కరాటే కళ్యాణి మండిపడ్డారు. ఈ ఆరోపణలు తట్టుకోలేక తన తల్లి, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామని అన్నారని వాపోయారు. వారికి తానే ధైర్యం చెప్పి.. విచారణకు హాజరయ్యారని తెలిపారు. 'నాపై ఆరోపణలు చేసిన వారిలో కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నారు.. నాపై ఎవరైతే నిరాధారమైన ఆరోపణలు చేశారో వారిని తొందరలోనే లీగల్‌గా ఎదుర్కొంటాను. రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు..' అని కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్నారిని ఇంతవరకు దత్తత తీసుకోలేదని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు కరాటే కళ్యాణి వివరించారు. తాను చిన్నారిని దత్తత తీసుకోవాలంటే న్యాయపరంగా తీసుకుంటానని చెప్పారు. చిన్నారి తల్లిదండ్రులు తనతో పాటే ఉంటున్నారని కూడా అధికారులకు కళ్యాణి తెలిపింది. చైల్డ్ వెల్ఫేర్ అధికారుల నుంచి కరాటే కళ్యాణికి క్లీన్ చీట్ రావడంతో ఇక ఈ వివాదానికి ఫూల్‌స్టాప్ పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.