యాప్నగరం

‘నీపై పగ తీర్చుకుంటా’... నితిన్‌కి వార్నింగ్ ఇచ్చిన కీర్తిసురేష్

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘రంగ్‌దే’ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయితో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Samayam Telugu 1 Dec 2020, 12:15 pm
‘మహానటి’ కీర్తి సురేష్‌ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా మారింది. లాక్‌డౌన్ సమయంలో ఆమె నటించిన రెండు సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజై తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితిన్‌తో ‘రంగ్‌దే’, మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ‘రంగ్‌దే’ షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా సెట్లో కీర్తి నిద్రపోతుండగా ఫోటో తీసిన నితిన్.. దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్‌ అవుతోందంటూ కామెంట్ చేశాడు.
Samayam Telugu Image


Also Read: ఈసారైనా లెక్క సరిచేస్తాడా?.. క్రేజీ కాంబోపై మహేశ్ ఫ్యాన్స్ ఆశలు
View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

ఈ సరదా ఫోటో సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన కీర్తి ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటా’ అని కామెంట్ చేసింది. దీంతో పాటు దుబాయి‌లోని అద్భుతమైన లొకేషన్లో దిగిన ఫోటోలను కూడా తన ఇన్‌‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసింది.
View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Also Read: ప్రభాస్‌తో మళ్లీ సినిమానా.. జనాలు భరించలేరు: రాజమౌళి షాకింగ్ కామెంట్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.