యాప్నగరం

మీనా భర్త మృతిపై తప్పుడు సమాచారం ఇవ్వొద్దు.. నటి కుష్బు రిక్వెస్ట్

మీనా భర్త విద్యాసాగర్ మృతిపై మీడియాలో వస్తున్న కథనాలపై నటి కుష్బు స్పందించారు. కోవిడ్‌ వల్ల సాగర్‌ని కోల్పోయమని చెప్పి తప్పుడు సందేశాన్ని ప్రచారం చేయవద్దంటూ మీడియాను కోరారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 29 Jun 2022, 5:15 pm

ప్రధానాంశాలు:

  • మీనా భర్త విద్యాసాగర్ మృతిపై కుష్బూ స్పందన
  • కోవిడ్ వల్ల మరణించారని ప్రచారం చేయొద్దు
  • మీడియాకు రిక్వెస్ట్ చేసిన నటి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu మీనా భర్త మరణంపై కుష్బు స్పందన
ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేస్తోంది. మీనా కుటుంబానికి సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన శ్వాసకోస సంబంధిత వ్యాధితో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా.. విద్యాసాగర్ మరణంపై విభిన్న కథనాలు వెలుడుతున్నాయి.
ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో మీనా కుటుంబసభ్యులు కరోనా బారిన పడి కోలుకున్నారు. మీనా, భర్త విద్యాసాగర్ ఆమె కుమార్తె నైనికా, కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అయితే విద్యాసాగ‌ర్ కోవిడ్‌ను జయించినా.. ఆయ‌న ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ అవ‌స‌రం అని వైద్యులు చెప్పగా.. దాత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారని సమాచారం. అయితే మీనా ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉన్నాయని.. అవి విడిచిన వ్యర్థాల నుంచి వ‌చ్చిన గాలిని పీల్చటంతో విద్యాసాగర్ ఆరోగ్యం దెబ్బతిని మరణించారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

విద్యాసాగర్ మృతిపై నటి కుష్బు స్పందించారు. మీడియా బాధ్యతగా వ్యవహరించాలంటూ ఆమె రిక్వెస్ట్ చేశారు. 'మీడియా కాస్త బాధ్యతగా వ్యవహరించాలని నేను చాలా వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. మీనా భర్తకు 3 నెలల క్రితం కోవిడ్ వచ్చింది. కరోనా అతని ఊపిరితిత్తుల పరిస్థితిని మరింత దెబ్బతీసింది. కోవిడ్‌ వల్ల సాగర్‌ని కోల్పోయమని చెప్పి తప్పుడు సందేశాన్ని పంపకండి. ఎలాంటి భయాన్ని కలిగించవద్దు. మనం జాగ్రత్తగా ఉండాలి..' అంటూ కుష్బు ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.