యాప్నగరం

ఇదేం పిచ్చి.. ఫ్యాన్స్‌కు మెహరీన్ స్వీట్ వార్నింగ్

హీరోయిన్ మెహరీన్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అది ఎంతలా అంటే ఒంటిపై పచ్చబొట్టు వేయించుకునేలా. ఇదే ఈ అమ్మడుకు అసలు నచ్చలేదు. ఓ అభిమాని చేసిన ఈ పిచ్చి పనితో బాగా హర్టయ్యింది. ఇదేం పిచ్చి రా బాబూ అనుకుందో ఏమో... వెంటనే ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

Samayam Telugu 10 Mar 2018, 6:59 pm
హీరోయిన్ మెహరీన్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అది ఎంతలా అంటే ఒంటిపై పచ్చబొట్టు వేయించుకునేలా. ఇదే ఈ అమ్మడుకు అసలు నచ్చలేదు. ఓ అభిమాని చేసిన ఈ పిచ్చి పనితో బాగా హర్టయ్యింది. ఇదేం పిచ్చి రా బాబూ అనుకుందో ఏమో... వెంటనే ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఫోటోను ట్వీట్ చేస్తూ స్పందించింది. తన కోసం ఇలాంటి పనులు చేయొద్దని... దీని కోసం మిమ్మల్ని మీరు బాధించుకోవద్దని స్వీట్‌గా చెప్పింది. అంతేకాదు మరీ ఇంత అభిమానమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
Samayam Telugu actress mehreen sweet tweet warning to fans
ఇదేం పిచ్చి.. ఫ్యాన్స్‌కు మెహరీన్ స్వీట్ వార్నింగ్


అభిమానం ఉంటే ఉండాలి కాని... ఇలాంటివి చేస్తా ఎలా అని ప్రశ్నించింది. ఫ్యాన్ లవ్, బిగ్ థాంక్యూ... ఐ లవ్ యూ ఆల్ అంటూ అభిమానులను జోష్‌లో నింపింది. మెహరీన్ అభిమాని ఒకరు ఇటీవలే తన మెడపై మెహరీన్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఆ ఫోటో ఈ బ్యూటీకి చేరడంతో... ఆమె ఆవేదనతో ట్వీట్ చేశారు. మరోవైపు నెటిజన్లు పచ్చబొట్టు వేయించుకున్న వ్యక్తిపై మండిపడుతున్నారు. ఎంత అభిమానం ఉన్నా... ఎవరైనా ఇలా చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

So much love 😇🙏 but please don’t hurt yourself with so much pain. I love you all 😘🙏 #fanlove #bigthankyou #humbled pic.twitter.com/xL0o1OZZ6I — Mehreen Pirzada (@Mehreenpirzada) March 10, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.