యాప్నగరం

త్వరలోనే బాయ్‌ఫ్రెండ్‌తో నమిత పెళ్లి ?

2002లో శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన సొంతం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ప్రముఖ సినీ నటి నమిత హీరోయిన్‌గా...

TNN 10 Nov 2017, 4:09 pm
2002లో శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన సొంతం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ప్రముఖ సినీ నటి నమిత హీరోయిన్‌గా మొదట్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ అనతికాలంలోనే అవకాశాలతోపాటే అమితంగా పర్సనాల్టీ పెరగడంతో ఆ కారణాలతోనే మళ్లీ సినిమాలకి దూరమైంది. తర్వాత కాలంలో తమిళతంబీలని ఎంటర్‌టైన్ చేసిన ఈ బొద్దుగుమ్మ కొద్దికాలంలోనే అక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. అలా పరిశ్రమలో ఫేడౌట్ అయిన హీరోయిన్ అనే ముద్రపడిన నమిత ఫైనల్‌గా పెళ్లి చేసుకుని సెటిల్ అవడానికే నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Samayam Telugu actress namitha to tie knot soon
త్వరలోనే బాయ్‌ఫ్రెండ్‌తో నమిత పెళ్లి ?


తన బాయ్ ఫ్రెండ్, నటుడు అయిన వీర్ అకా వీరేంద్రను నమిత పెళ్లి చేసుకుంటోందట. నవంబర్ 24న వీళ్ల పెళ్లి జరగనున్నట్టు నమిత ఫ్రెండ్ రైజా విల్సన్ ఓ వీడియో ద్వారా తెలిపారని కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చుకున్న నమిత ఆ తర్వాతి కాలంలో కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమల్లోనూ నటించి దాదాపు 40కి పైగా సినిమాలు చేసింది. తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా వంటి సినిమాలు ఆమె కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండే చిత్రాలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.