యాప్నగరం

టాలీవుడ్‌ హీరోతో డేటింగ్.. అసలు సంగతి చెప్పిన నిధి అగర్వాల్

కొన్నాళ్లుగా ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలను నిధి అగర్వాల్ ఖండించింది. ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది.

Samayam Telugu 23 Oct 2020, 12:25 pm
నాగచైతన్య సరసన ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల నిధి అగర్వాల్. ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’లో ఛాన్స్ కొట్టినా ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. అయితే రామ్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ నిధి కెరీర్‌నే మార్చేసింది. అభినయంతో పాటు అందాల ప్రదర్శనలో మరో హీరోయిన్ నభా నటేష్‌తో పోటీ పడి మంచి గుర్తింపు దక్కించుకుంది.
Samayam Telugu నిధి అగర్వాల్


Also Read: నాన్న నెమ్మదిగా కోలుకుంటున్నారు.. ఆందోళన వద్దు : శివాత్మిక రాజశేఖర్

ఆ ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ ప్రస్తుతం అశోక్ గ‌ల్లా డెబ్యూట్ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. తమిళంలో శింబుతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్రినాథరావు న‌క్కిన డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాలోనూ అమ్మడిని తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

Also Read: హైపర్ ఆదికి కరోనా పాజిటివ్.. జబర్దస్త్ షూటింగ్‌కు బ్రేక్!

ఇక అసలు విషయానికొస్తే.. నిధి అగర్వాల్ కొంతకాలంగా ఓ టాలీవుడ్ హీరోగా ప్రేమలో ఉందని, అతడితో డేటింగ్ కూడా చేస్తోందని ప్రచారం జరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఈ బ్యూటీని ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేసింది. దీంతో కొన్నాళ్లుగా తనపై వస్తున్న రూమర్లకు నిధి చెక్ పెట్టేసింది.

Also Read: రికార్డుల బాహుబలి.. ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ టాలీవుడ్.. హ్యాపీ బర్త్‌డే రెబల్‌ స్టార్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.