యాప్నగరం

Pujitha Ponnada: దేవిశ్రీ ప్రసాద్‌తో సీక్రెట్‌గా పెళ్లి.. నటి పూజిత పొన్నాడ క్లారిటీ

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad)ను రహస్య వివాహం చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై నటి పూజిత (Pujita Ponnada) క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేవిశ్రీ ప్రసాద్‌తో రిలేషన్‌షిప్‌పై స్పందించింది.

Authored byAshok Krindinti | Samayam Telugu 4 Sep 2022, 5:23 pm
తుంటరి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది నటి పూజిత (Pujitha Ponnada). 'రంగస్థలం' సినిమాలో ఆది పినిశెట్టి ప్రియురాలి క్యారెక్టర్‌తో మంచి పేరు తెచ్చుకుంది. తరువాత 'కల్కి' మూవీలో రొమాంటిక్ లేడీ ఎస్‌ఐగా మోడరన్ లుక్స్‌లో ఆకట్టుకుంది. 'ఊపిరి' 'మిస్‌ ఇండియా', 'ఓదెల రైల్వేస్టేషన్‌' వంటి సినిమాల్లో నటించినా.. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. తాజాగా ఆకాశ వీధుల్లో మూవీ ద్వారా ఆడియన్స్‌ ముందుకు వచ్చింది.
Samayam Telugu pujitha ponnada, Devi sri prasad
పూజిత పొన్నాడ, దేవీ శ్రీ ప్రసాద్


ఇటీవల ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad)తో రిలేషన్‌షిప్‌పై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. రహస్యం వివాహం చేసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేసింది. తాను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌ లేనని స్పష్టం చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌‌తో రిలేషన్‌షిప్‌లో వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి సింగిల్ అని.. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే బాధగా అనిపిస్తుందని చెప్పింది.

కాగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర మల్లు మూవీలో ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కింది. 'హరిహర మల్లులో నా పార్ట్ షూటింగ్ పూర్తయింది. పవన్ సార్‌తోనే అన్ని సీన్లు చేశా. సాంగ్‌లో కూడా నటించా. ఈ సినిమా కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్‌ గారితో నటించినప్పుడు కాస్త భయం వేసింది. సెట్‌లో 500 మంది డ్యాన్సర్లతో సాంగ్ షూట్ చేసినప్పుడు టెన్షన్ పడ్డా..' అంటూ పూజిత పొన్నాడ చెప్పుకొచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.