యాప్నగరం

కమల్‌ హాసన్‌ పాత్రలో మెరిసిన రాశి.. ఆ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు

హీరోయిన్‌గా ఎందరో హీరోలతో నటించిన రాశి చిన్నతనంలోనే ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ హిందీ చిత్రంలో కమల్‌ హాసన్ చిన్ననాటి పాత్రలో మెరిశారు.

Samayam Telugu 5 Nov 2020, 9:32 am
వెండితెరపై బాలనటిగా అడుగుపెట్టి హీరోయిన్‌గా అనేక మంది హీరోల పక్కన నటించారు రాశి. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా కనుమరుగయ్యారు. అప్పుడప్పుడు చిన్నచిన్న పాత్రల్లో కనిపిస్తున్నా అవన్నీ ఆమె రీఎంట్రీకి సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. అసలు విషయానికొస్తే.. రాశి బాలనటిగా చాలా సినిమాల్లో నటించారు. అలా ఓ హిందీ చిత్రంలో కమల్‌ హాసన్‌ చిన్ననాటి పాత్రలో నటించింది రాశి.
Samayam Telugu రాశి


Also Read: దశావతారం, నాన్నకు ప్రేమతో.. ఈ రెండు సినిమాలకు లింకేంటో తెలుసా?

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్, తమిళ టాప్ హీరోలు కమల్‌ హాసన్, రజినీ కాంత్‌తో ‘గిరఫ్తార్‌’ సినిమా తెరకెక్కింది. అందులో కమల్‌ హాసన్ చిన్న వయసులోనే తండ్రి చనిపోతే తల్లిని పట్టుకుని ఉండే సన్నివేశం అది. రాశిది చాలా చిన్న వయసు కావడంతో కెమెరా ముందు ఎలా ఉండాలో కూడా ఆమెకు తెలీదు. చుట్టూ ఉన్నవారిని చూసి కంటతడి పెట్టుకుందట.

Also Read: ఇదేం వెరైటీ... పుట్టినరోజు నాడు నగ్నంగా పరుగెత్తిన నటుడు
తల్లి పాత్రలో నటిస్తున్న మహిళ ఎత్తుకుంటే అమ్మ కావాలంటూ గట్టిగా ఏడ్చేసిందట. ఎంత బుజ్జగించినా ఏడుపు ఆపకపోవడంతో ఆమె తల్లితోనే ఆ పాత్ర పోషించారు. ‘అలా తన అమ్మ కూడా ఆ సినిమాలో నటించింది’ అని రాశి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

Also Read: లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టుకు నో చెప్పిన సాయిపల్లవి?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.