యాప్నగరం

రకుల్‌కి హ్యాండిచ్చేశాడు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో దూకుడు చూపించిన రకుల్ ప్రీత్ సింగ్...

TNN 17 Nov 2017, 4:22 pm
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో దూకుడు చూపించిన రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఏడాదిలో ఆమె నటించిన 'రా రండోయ్ వేడుక చూద్దాం' తప్ప మరే సినిమా సక్సెస్ కాలేదు. ‘స్పైడర్’ సినిమాతో కోలీవుడ్‌లో పాగా వేద్దామనుకుంది. అది కూడా వర్కవుట్ కాలేదు. దీంతో తమిళంలో విజయం అందుకోవాలనే ఆశ అలానే ఉండిపోయింది. ప్రస్తుతం కార్తీ సరసన ఆమె నటించిన 'ఖాకీ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో అటు తమిళంలో ఇటు తెలుగులో విజయం అందుకుంటాననే నమ్మకంతో ఉంది. అయితే గత కొద్దిరోజులుగా రకుల్‌కు మురుగదాస్ మరో సినిమా అవకాశం ఇచ్చాడని వార్తలు వినిపించాయి.
Samayam Telugu actress rakul preet singh missed chance in vijay and murugadoss film
రకుల్‌కి హ్యాండిచ్చేశాడు!


విజయ్ హీరోగా మురుగదాస్ డైరెక్ట్ చేయనున్న సినిమాలో రకుల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఇప్పుడు రకుల్ స్థానంలో నయనతారను తీసుకోవాలని అనుకుంటున్నారట. తాజాగా 'అరామ్' సినిమాతో విజయం అందుకున్న నయన్‌ను విజయ్ సినిమాలో తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. అదే గనుక జరిగితే ఓ క్రేజీ ఆఫర్ రకుల్ పోగొట్టుకున్నట్లే అవుతుంది. మరి ఈ సినిమాలో నయన్‌తో పాటు రకుల్ కూడా నటిస్తుందా..? లేక నిజంగానే రకుల్‌ను తప్పించి నయన్‌ను తీసుకున్నారా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.